‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ ‘నో పెళ్లి..’ సాంగ్ విడుదల

Video song from Solo Brathuke So Better released

Mon 25th May 2020 08:28 PM
Advertisement
nithiin,solo brathuke so better movie,no pelli song,sai tej,varun tej,ss thaman,subbu  ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ ‘నో పెళ్లి..’ సాంగ్ విడుదల
Video song from Solo Brathuke So Better released ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ ‘నో పెళ్లి..’ సాంగ్ విడుదల
Advertisement

‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ నుంచి విడుద‌లైన వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’.. సాయితేజ్‌తో పాటు సాంగ్‌లో సంద‌డి చేసిన వ‌రుణ్ తేజ్‌, రానా ద‌గ్గుబాటి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ను యువ కథానాయకుడు నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్‌తేజ్, రానా కూడా సంద‌డి చేయ‌డం విశేషం. 

సాంగ్ విడుద‌ల చేసిన త‌ర్వాత ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్ర‌తుకే సో  బెట‌ర్‌’ సాంగ్‌ను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. కొన్నిసార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ, చేసుకోవ‌డం మాత్రం ప‌క్కా’’ అని నితిన్ తెలిపారు. 

‘‘ఈ సాంగ్‌లో భాగం కావ‌డం చాలా ఫ‌న్‌గా అనిపించింది’’ అని వ‌రుణ్ తేజ్ తెలిపారు. 

‘‘నా యూత్‌లో టంగ్ స్లిప్ అనొచ్చు సాయితేజ్‌’’ అని రానా అన్నారు. 

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాట‌ను పాడారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు.  ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు

నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌

ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

సంగీతం: త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌

పి.ఆర్‌.ఓ: వంశీ కాకా

Click Here for Song

Advertisement

Video song from Solo Brathuke So Better released:

Nithiin released Solo Brathuke So Better movie no pelli song

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement