ముస్తాబ‌వుతోన్న ‘సుంద‌రాంగుడు’

sundarangudu movie in post production Stage

Mon 25th May 2020 08:54 AM
Advertisement
sundarangudu movie,post production stage,krishna sai,vinay babu,mouryani  ముస్తాబ‌వుతోన్న ‘సుంద‌రాంగుడు’
sundarangudu movie in post production Stage ముస్తాబ‌వుతోన్న ‘సుంద‌రాంగుడు’
Advertisement

సుంద‌రంగా ముస్తాబ‌వుతోన్న మంచి టానిక్ లాంటి కామెడీ సినిమా ‘సుంద‌రాంగుడు’

ఎమ్‌ఎస్‌కె ప్ర‌మిద శ్రీ ఫిలింస్ ప‌తాకంపై కృష్ణ సాయి, దేవ‌క‌న్య మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్‌.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సుంద‌రాంగుడు’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు ప్రారంభించుకుంది.

ఈ సందర్భంగా హీరో స్పెషల్ స్టార్ కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘‘హీరోగా చేయాలన్న‌ది నా కోరిక‌. సూపర్ స్టార్ కృష్ణగారి వీరాభిమానిని.... క్రిష్ణ గారి సినిమాలు ప్రతి సినిమా చూసే వాణ్ణి. ఒక మంచి సినిమా చేయాల‌ని అనుకుంటోన్న త‌రుణంలో మంచి కథ‌తో వ‌చ్చారు డైరెక్టర్ వినయ్ బాబుగారు. సుందరాంగుడు కథ కథనాలు నాకు బాగా నచ్చాయి. నా బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా స్టోరీ ఉంటుంది. ఇక పాటలు సినిమాకు ప్రధాన ఆక‌ర్ష‌ణ అని చెప్పవ‌చ్చు. సుందరాంగుడు.. అన్ని సినిమాల లాగా కాదు. విభిన్న‌మైన కామెడీ సినిమా.. ఈ సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ కొత్త‌గా ఉంటుంది. హీరో .. జమీందార్.. బిడ్డ... డబ్బు అహంకారంతో అన్ని నాకే దక్కాలని.. అందమైన అమ్మాయిలను వశపర్చుకోవాలని అమ్మాయిలు వెంట పడుతుంటాడు... కానీ అతనికి ఏ ఒక్క అమ్మాయి పడకపోగా...ప్ర‌తి అమ్మాయి  అవమానిస్తుంది. తనను అవమాన పరిచిన అమ్మాయిలను ఎలా వశపర్చుకున్నాడు అన్నది కథ. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.. మనిషికి మనసు సుందరంగా ఉండాలి కానీ.. మనిషి సుందరంగా ఉన్నంత మాత్రాన. .. నిజమైన అందగాడు కాదు... మనిషికి మంచి మనసే నిజమైన అందం అనే అంశాన్ని మా సినిమాలో చెబుతున్నాం’’ అన్నారు.

హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ.. ‘‘ఇందులో నా పాత్ర పేరు దేవకన్య. నా క్యారెక్టర్‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. డైరెక్టర్ వినయ్ బాబుగారు సబ్జెక్ట్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ సినిమాలు వచ్చాయి.. కానీ ఇలాంటి కథ, కథనాల‌తో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు.. అందుకే.. ఈ సుందరాంగుడు సినిమా అన్ని సినిమాలలో ఒక ప్రత్యేక మైన సినిమా అని’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు విన‌య్ బాబు మాట్లాడుతూ.. ‘‘సుంద‌రాంగుడు సినిమా ఒక మంచి టానిక్ లాంటి కామెడీ సినిమా. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా. శివుడి మీద వ‌చ్చే పాట సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంది. లాక్ డౌన్ వ‌ల్ల సినిమా కొంచెం లేట‌యింది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభించాం. సుంద‌రాంగుడు సినిమా ఒక ప్ర‌ముఖ సంస్థ రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చింది. త్వర‌లో ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తాం. ఇక మా నిర్మాత ఎక్క‌డా రాజీపడ‌కుండా సినిమాను నిర్మించారు. అలాగే మా హీరో కృష్ణ సాయి సుంద‌రాంగుడు పాత్ర‌కు ప్రాణం పోశాడు. ఈ సినిమా హీరోగా త‌న‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

కృష్ణసాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విల‌న్‌గా అమిత్ తివారి న‌టిస్తున్నారు. మిగ‌తా పాత్ర‌ల్లో  జీవా, జూ రేలంగి, బాషా , మిర్చి మాధవి, శివకృష్ణ... తదితరులు న‌టిస్తున్నారు.

ఎడిటింగ్: నందమూరి హరి

ఫైట్స్: రామ్ సుంకర

కొరియోగ్రఫీ: పాల్, సూర్య కిరణ్

డీ ఓ పి: వెంకట్ హనుమాన్

మ్యూజిక్: సిద్ధ బాపు

కథ, కథనం, మాటలు, పాటలు,దర్శకత్వం : ఎం. వినయ్ బాబు

నిర్మాత: బీసు చందర్ గౌడ్

Advertisement

sundarangudu movie in post production Stage:

sundarangudu movie latest Update

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement