వారిద్దరిలో చిరు సినిమా ఎవరితో ఉండనుందో..?

Sat 23rd May 2020 05:30 PM
chiranjeevi,sujith,bobby,venky mama,saaho,prabhas,venkatesh   వారిద్దరిలో చిరు సినిమా ఎవరితో ఉండనుందో..?
Who will be directing Chiranjeevi..? వారిద్దరిలో చిరు సినిమా ఎవరితో ఉండనుందో..?
Sponsored links

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఆచార్య సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం షూటింగులకి అనుమతి ఇస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జూన్ నుండి సినిమా షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు. అయితే ఆచార్య సినిమాని పక్కన పెడితే చిరంజీవి తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండనుందనేది సస్పెన్స్ గా మారింది.

మళయాల చిత్రమైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి తగిన విధంగా తీర్చిదిద్దమని సుజిత్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. సాహో సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ చిరంజీవి ఈ బాధ్యతని సుజిత్ కి అప్పగించాడు. ప్రస్తుతం సుజిత్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడు. అలాగే దర్శకుడు బాబీ చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన చిరంజీవి పూర్తి స్క్రిప్టుని తీసుకురమ్మని చెప్పాడని టాక్. 

వెంకీమామా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయినా ఓ మోస్తారు విజయాన్ని అందుకున్న బాబీ. ప్రస్తుతం బాబీ బౌండెడ్ స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడట. మరి వీరిద్దరిలో ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడో అర్థం కాకుండా ఉంది. అయితే చిరు ఆలోచన ప్రకారం ఎవరి కథ నచ్చితే వారితోనే ముందుకు వెళ్తాడని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో చిరుని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. 

Sponsored links

Who will be directing Chiranjeevi..?:

from Those two, Who will be the lucky guy to direct a Chiranjeevi

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019