లూజర్ లో నేను ఇబ్బందిపడ్డ సందర్భం...పావని గంగిరెడ్డి

Thu 21st May 2020 04:23 PM
loser,priyadarshi,anie,pavani gangireddy,telugu web series  లూజర్ లో నేను ఇబ్బందిపడ్డ సందర్భం...పావని గంగిరెడ్డి
Pavani Gangireddy feltbad in loser first day shoot.. లూజర్ లో నేను ఇబ్బందిపడ్డ సందర్భం...పావని గంగిరెడ్డి
Sponsored links

తెలుగులో వెబ్ సిరీస్ లు జోరందుకున్నాయి. గతంలో వీటి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కరోనా కారణంగా ప్రస్తుతం అందరూ వీటి గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ లన్నింటిలో కెల్లా ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న వెబ్ సిరీస్ లూజర్. ముగ్గురు ఆటగాళ్ళ జీవితంలో తాము ఎదగడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చూపించిన వెబ్ సిరీస్ ఇది. ఆ ముగ్గురిలో కమేడియన్ ప్రియదర్శి ఒకరు ఉన్నారు.

అయితే ఈ లూజర్ లో పావని గంగిరెడ్డి ఓ కీలకమైన పాత్రలో కనిపించారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటనలోకి వచ్చి ఆ తర్వాత వెండితెర మీద మెరిసి, చిన్న చితకా పాత్రల్లో కనిపించే పావనికి లూజర్ లో మంచి పాత్ర దక్కింది. ఈ పాత్రకి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే లూజర్ సిరీస్ లో ఒకానొక సారి ఆమె ఇబ్బంది పడిందట. సాధారణంగా వెబ్ సిరీస్ అనగానే ఎక్కువగా కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ కనిపిస్తుంటాయి.

ఇందులో అలాంటివేమీ అంతగా లేకపోయినా, పావని గంగిరెడ్డి మొదటిసారి ఇబ్బంది పడిందట. ఆమె మొదటి సన్నివేశమే భార్యగా భర్తతో రొమాన్స్ చేసే సీన్ ఉందట. మొదటి రోజే అలాంటి సన్నివేశం ఉండడంతో కొంత ఇబ్బందిగా ఫీల్ అయిందట. కానీ దర్శకుడు అభిలాష్ సహకారంతో ఆ సీన్ ని విజయవంతంగా పూర్తి చేశానని.. మళ్ళీ అలాంటి ఇబ్బందిపడే సీన్లేవీ లేకపోవడంతో హాయిగా పూర్తిచేశానని చెప్పుకొచ్చింది.

Sponsored links

Pavani Gangireddy feltbad in loser first day shoot..:

Pavani gangireddy sharing her experience from Loser

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019