ఉప్పెన ఉప్పొంగేది థియేటర్లోనే...!

Thu 21st May 2020 03:42 PM
uppena,vaishnav tej,sukumar,mythri movie makers,kriti shetty  ఉప్పెన ఉప్పొంగేది థియేటర్లోనే...!
Uppena will be releasing in Theatres.. ఉప్పెన ఉప్పొంగేది థియేటర్లోనే...!
Sponsored links

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపిస్తుంది. సుకుమార్ శిష్యుడు బిచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నీ సజావుగా సాగితే ఈ పాటికి ఈ సినిమా థియేటర్లలో రిలీజై ఉండేది.

కానీ కరోనా కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సో ఉప్పెన ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. ఒకానొక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుండి ఉప్పెన సినిమాకి భారీ ఆఫ్హర్ వచ్చిందని, మెగా మేనల్లుడి ఎంట్రీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారానే ఉంటుందని అన్నారు. కానీ తాజా సమాచారంప్రకారం నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ లు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదట.

ఈ సినిమాకి అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడంతో ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నారట. మేగా మేనల్లుడు ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఎంత కాదనుకున్నా చిన్న సినిమానే. మరి ఈ చిన్న సినిమాకి ఓటీటీ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాదు. సో నిర్మాతలు ఓటీటీ లో రిలీజ్ చేయడంపై వెనక్కి తగ్గారని సమాచారం. థియేటర్లు తెరుచుకున్నాక ముందుగా రిలీజ్ అయ్యే చిత్రం ఇదే అవుతుందని అంచనా వేస్తున్నారు.

Sponsored links

Uppena will be releasing in Theatres..:

Uppena will be releasing in Theatres

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019