ఈ గాయనికి కూడా విజయే కావాలంట!

విజయ్ దేవరకొండ స్టయిల్ అంటే పడిచచ్చిపోయే హీరోయిన్స్ లిస్ట్ అంతకంతకు పెరిగిపోతుంది. బాలీవుడ్ నుండి కోలీవుడ్, టాలీవుడ్‌లలో హీరోయిన్స్ అందరికీ విజయ్ దేవరకొండ అంటే క్రష్, విజయ్ తో ఓ ఛాన్స్ వస్తే చాలు అన్నట్టుగా ఉంది వ్యవహారం. తాజాగా టాలీవుడ్ సింగర్ ఒకామె.. తాను హీరోయిన్ గా పరిచయమయ్యే సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన అయితే నటిస్తాను అంటుంది. ఇప్పటికే పెళ్లి అయ్యి పాప కూడా ఉన్న శ్రావణ భార్గవి తాజాగా ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతూ... తనకి టాలీవుడ్‌లో సూపర్ స్టయిల్ హీరో హీరోయిన్స్‌గా సమంత, విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెబుతుంది.

ఇక హీరోయిన్ గా పరిచయమైతే ఏ హీరోతో కలిసి నటించాలని ఉంది అంటే... టక్కుమని విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. విజయ్ దేవరకొండ, సాయి పల్లవి నటన అంటే ఇష్టమని చెబుతుంది. ఇక తన కెరీర్ లో ఓ పాట పాడడానికి ఇబ్బంది పడిన సందర్భం.. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోని సూపర్ మచ్చి పాట పాడినప్పుడు కాస్త కష్టంగా అనిపించింది అని చెబుతుంది. ఆ పాట పాడినప్పుడు బాగా జ్వరంతో బాధపడుతున్నా అని... అందుకే ఆ పాట పడడానికి కాస్త ఇబ్బంది పడ్డా అని చెబుతుంది. ఇక ఈమధ్యకాలంలో నాకు నచ్చిన సినిమా కోకో అని.. హిందీలో తప్పడ్ అని చెబుతుంది.

Singer Sravana Bhargavi wants Movie with Vijay deverakonda

Singer wants Vijay Deverakonda
singer sravana bhargavi
vijay deverakonda
heroines
tollywood
samantha
sai pallavi