ఈ గాయనికి కూడా విజయే కావాలంట!

Thu 21st May 2020 05:28 PM
singer sravana bhargavi,vijay deverakonda,heroines,tollywood,samantha,sai pallavi  ఈ గాయనికి కూడా విజయే కావాలంట!
Singer wants Vijay Deverakonda ఈ గాయనికి కూడా విజయే కావాలంట!
Sponsored links

విజయ్ దేవరకొండ స్టయిల్ అంటే పడిచచ్చిపోయే హీరోయిన్స్ లిస్ట్ అంతకంతకు పెరిగిపోతుంది. బాలీవుడ్ నుండి కోలీవుడ్, టాలీవుడ్‌లలో హీరోయిన్స్ అందరికీ విజయ్ దేవరకొండ అంటే క్రష్, విజయ్ తో ఓ ఛాన్స్ వస్తే చాలు అన్నట్టుగా ఉంది వ్యవహారం. తాజాగా టాలీవుడ్ సింగర్ ఒకామె.. తాను హీరోయిన్ గా పరిచయమయ్యే సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన అయితే నటిస్తాను అంటుంది. ఇప్పటికే పెళ్లి అయ్యి పాప కూడా ఉన్న శ్రావణ భార్గవి తాజాగా ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతూ... తనకి టాలీవుడ్‌లో సూపర్ స్టయిల్ హీరో హీరోయిన్స్‌గా సమంత, విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెబుతుంది.

ఇక హీరోయిన్ గా పరిచయమైతే ఏ హీరోతో కలిసి నటించాలని ఉంది అంటే... టక్కుమని విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. విజయ్ దేవరకొండ, సాయి పల్లవి నటన అంటే ఇష్టమని చెబుతుంది. ఇక తన కెరీర్ లో ఓ పాట పాడడానికి ఇబ్బంది పడిన సందర్భం.. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోని సూపర్ మచ్చి పాట పాడినప్పుడు కాస్త కష్టంగా అనిపించింది అని చెబుతుంది. ఆ పాట పాడినప్పుడు బాగా జ్వరంతో బాధపడుతున్నా అని... అందుకే ఆ పాట పడడానికి కాస్త ఇబ్బంది పడ్డా అని చెబుతుంది. ఇక ఈమధ్యకాలంలో నాకు నచ్చిన సినిమా కోకో అని.. హిందీలో తప్పడ్ అని చెబుతుంది.

Sponsored links

Singer wants Vijay Deverakonda :

Singer Sravana Bhargavi wants Movie with Vijay deverakonda

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019