Advertisementt

‘ఆర్‌ఆర్‌ఆర్’ హీరోల స్క్రీన్ స్పేస్ సంగతేంటి?

Tue 05th May 2020 06:59 PM
mm keeravani,reveal secret,rrr movie,ram charan,ntr,rajamouli  ‘ఆర్‌ఆర్‌ఆర్’ హీరోల స్క్రీన్ స్పేస్ సంగతేంటి?
RRR Movie Latest Update ‘ఆర్‌ఆర్‌ఆర్’ హీరోల స్క్రీన్ స్పేస్ సంగతేంటి?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్రర్ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఈమూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దశాబ్దాలుగా టాలీవుడ్ లో పోటీదారులుగా ఉన్న నందమూరి మరియు మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి నటించడం అనేది ఆసక్తికర అంశం. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఇందులో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు స్క్రీన్ స్పేస్ సమానంగా ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. వీరిద్దరికి సమాన స్క్రీన్ స్పేస్ ప్రాధాన్యత ఉంటుందని రాజమౌళి చెప్పడం జరిగింది. ఈ హీరోల ఇద్దరికీ స్క్రీన్ స్పేస్ సమానంగా పంచే బాధ్యత తీసుకున్నాడు కథకుడు విజయేంద్ర ప్రసాద్. ఎన్టీఆర్, చరణ్ లకు సమాన స్క్రీన్ స్పేస్ మరియు ప్రాధాన్యం ఉండేలా ఆయన స్క్రిప్ట్ లో తగు జాగ్రత్తలు తీసుకున్నారట.

ఈ విషయాన్నీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. పైగా ఇద్దరు హీరోలు ఎదురుపడే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈమూవీ అన్ని అనుకున్నట్టు జరిగితే జనవరి 8న విడుదల కానుంది.

RRR Movie Latest Update:

MM Keeravani Revealed The Secrets of RRR

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ