Advertisementt

మెగాస్టార్ ట్వీట్ కి ఆసక్తికరంగా రిప్లై ఇచ్చిన నాని..

Tue 28th Apr 2020 01:08 PM
megastar chiranjeevi,nani,acharya,ccc,covid19,lockdown celebrities  మెగాస్టార్ ట్వీట్ కి ఆసక్తికరంగా రిప్లై ఇచ్చిన నాని..
Nani nteresting reply to Megastar Chiranjeevi.. మెగాస్టార్ ట్వీట్ కి ఆసక్తికరంగా రిప్లై ఇచ్చిన నాని..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి సొషల్ మీడియాలో జాయిన్ అయినప్పటి నుండి వరుస అప్డేట్లతో అభిమానులకి హుషారుని కలిగిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఆచార్య సినిమా షూటింగ్ ని అందరికంటే ముందే నిలిపేసి, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం విరాళాలు సేకరిస్తున్నాడు. ఈ ఛారిటీకీ టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఆ విషయం పక్కన పెడితే, ట్విట్టర్ లో మెగాస్టార్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. మొన్నటికి మొన్న బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజిని పూర్తి చేసి వావ్ అనిపించాడు.

ఇకపోతే ఈ రోజు తన మనవరాలితో ఆడుకుంటున్న వీడియోని షేర్ చేసాడు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది. ఖైదీ నంబర్ 150 సినిమాలో సాయంకాలాన.. సాగర తీరాన అనే పాటకి మనవరాలు డాన్స్ చేస్తుంటే, ఆమె డాన్స్ ని ఆస్వాదిస్తూ తాను కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో అందరికీ నచ్చింది. అయితే దీనిపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ, ఇద్దరు చిన్నపిల్లలే ఉన్నారు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు సార్ అని ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. 

లాక్డౌన్ సమయంలో ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలని షేర్ చేస్తున్న చిరంజీవి మెగా అభిమానులనే కాదు అందర్నీ ఉత్సాహ పరుస్తున్నాడు.

Nani nteresting reply to Megastar Chiranjeevi..:

Nani interesting reply to Megastar Chiranjeevi

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ