Advertisementt

చిరంజీవి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకీ..

Wed 22nd Apr 2020 01:47 PM
venkatesh,megastar chiranjeevi,jr ntr,rajamouli   చిరంజీవి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకీ..
Venkatesh waiting for megastars video చిరంజీవి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకీ..
Advertisement
Ads by CJ

లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలని కాపాడడానికి అటు వైద్య బృందం, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి పోరాటం చేస్తుంటే, కరోనా బారిన పడకుండా తమ ప్రాణాల్ని రక్షించుకోవడానికి అందరూ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. అయితే అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో సోషల్ మీడియా ద్వారా సినిమా సెలెబ్రిటీలు ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు.

ఈ మధ్య ట్విట్టర్ లో బీ ద రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ బాగా జోరందుకుంది. టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఈ ఛాలెంజిని స్వీకరిస్తూ తమ సహనటులకి ఛాలెంజి విసురుతున్నారు. ఈ ఛాలెంజ్ ప్రకారం ఇంటి పని, అనగా ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం బట్టలు సర్దటం, మొదలగునవి చేస్తూ ఆడవాళ్లకి సాయంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చాలెంజి వైరల్ అవుతుంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి చేసిన ఛాలెంజిని స్వీకరించి, దాన్ని కంప్లీట్ చేసి వెంకటేష్ తో సహా మెగాస్టార్ చిరంజీవికి ఛాలెంజి విసిరాడు. అయితే ఛాలెంజిని ఒప్పుకున్న వెంకటేష్, తాను మెగాస్టార్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ట్విట్టర్ లో జాయిన్ అయినప్పటి నుండి చిరంజీవి చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ విసిరిన ఈ చాలెంజిని చిరంజీవి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో.. చిరంజీవి వీడియో కోసం వెంకటేష్ ఒక్కడే కాదు అందరూ ఎదురుచూస్తున్నారు.

Venkatesh waiting for megastars video:

Venkatesh waiting for Megastars be the real man video

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ