ఆ చిత్ర రీమేక్‌లో సమంత అంటున్నారు

సమంతకి టాలీవుడ్‌లో రీమేక్ రాణి టైటిల్ తగిలించారు. పెళ్లయ్యాక సమంత చేసిన చాలా సినిమాలు రీమేక్స్. యూటర్న్, ఓ బేబీ, జాను అన్ని రీమేక్స్. అయితే సమంత చేసిన రీమేక్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయినవే. కానీ తమిళ రీమేక్ 96 రీమేక్ ‘జాను’ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ..... ఈ సినిమాకి అస్సలు కలెక్షన్స్ రాలేదు. ఇక ‘జాను’ తర్వాత సమంత టాలీవుడ్ లో సినిమాలేవీ ఒప్పుకోలేదు. అంతేకాదు.. తమిళనాట నయనతార - విజయ్ సేతుపతి కాంబోలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుండి సమంత బయటికి వచ్చేసిందనే టాక్ ఉంది.

అయితే తాజాగా సమంత ఓ కన్నడ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కన్నడలో తెరకెక్కిన దియా సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా ని తెలుగులో రీమేక్ చెయ్యాలని సమంత ప్రయత్నాలు మొదలెట్టిందట. ఆ సినిమాని సమంత స్వయానా నిర్మించబోతుంది అని.. సొంత బ్యానేర్ లోనే దియా కన్నడ రీమేక్ ఉంటుంది అని... అంటున్నారు. మరోపక్క ఈ సినిమాలో సమంత పోషించాలనుకుంటున్న పాత్ర... సమంత కెపాసిటికి ఎంత మాత్రం సరిపోదనే అభిప్రాయాలను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారట. కానీ సమంత మాత్రం దియా రీమేక్ చెయ్యాలనే ప్లాన్‌లో ఉందట.

Heroine Samantha in Dia Remake

Samantha in One More Remake
samantha
dia
remake
tollywood
heroine
one more remake