Advertisement

కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేది ఆ నెలలోనే..?

Sun 19th Apr 2020 03:07 AM
kgf,kgf2,yash,prashanth neel  కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేది ఆ నెలలోనే..?
KGF 2 trailer will be releasing on..? కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేది ఆ నెలలోనే..?
Advertisement

బాహుబలి స్ఫూర్తితో తెరకెక్కిన సినిమాలన్నింటిలోకి జనాలని ఎక్కువగా ఆకర్షించిన చిత్రం కేజీఎఫ్ . కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. బంగారం మాఫియా గురించిన కథలో హీరో ఎలివేషన్స్ ని పీక్స్ లో చూపించారు. గత కొన్నేళ్లలో ఒక సినిమాలో అన్ని ఎలివేషన్స్ సీన్స్ ఉండటం అన్నది ఇదే మొదటిసారేమో.

కన్నడతో సహా హిందీ, దక్షిణాది భాషల్లో రిలీజైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. దాంతో కేజీఎఫ్ అభిమానులు రెండవ ఛాప్టర్ కోసం ఎదురుచుస్తున్నారు. కరోనా కారణంగా కేజీఎఫ్ 2 చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా పడింది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 23వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అప్పటి లోగా సినిమా నుండి టీజర్ వదిలితే బాగుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి టీజర్ ని విడుదల చేసే ఆలోచనే లేదట. సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి, సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు డైరెక్ట్ గా ట్రైలర్ తోనే వస్తారట. అంటే అప్పటి వరకు సినిమాకి సంబంధించిన ఎలాంటి టీజర్ రిలీజ్ కాదట. అన్నట్టు ఈ సినిమాలో   అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నాడు. 

KGF 2 trailer will be releasing on..?:

kgf 2 trailer releasing on

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement