Advertisementt


ఎన్టీఆర్ పుట్టినరోజుకి రామరాజు గిఫ్ట్ లేనట్టే..?

Sat 18th Apr 2020 04:41 PM
rrr,rajamouli,ntr,keeravani,ramcharan  ఎన్టీఆర్ పుట్టినరోజుకి రామరాజు గిఫ్ట్ లేనట్టే..?
No Gift for NTR birthday from Ramaraju..? ఎన్టీఆర్ పుట్టినరోజుకి రామరాజు గిఫ్ట్ లేనట్టే..?
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ నుండి రాజమౌళి రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేశాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చిన్నపాటి వీడియోని రిలీజ్ చేశాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోతో అభిమానులు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇచ్చాడు రాజమౌళి. ఈ వీడియోని అల్లూరి సీతారామరాజుగా చేస్తున్న రామ్ చరణ్ కి కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించాడు.

రామ్ చరణ్ పుట్టినరోజున ఎన్టీఆర్ తో గిఫ్ట్ ఇప్పించినట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు రామ్ చరణ్ తో గిఫ్ట్ ఇప్పించి కొమరం భీమ్ లుక్ ని రివీల్ చేస్తాడని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజున లుక్ రివీల్ చేయడం లేదని చెబుతున్నారు. ఎన్టీఆర్ పై ఇంట్రడక్షన్ షాట్లు తీయకపోవడం వల్లే లుక్ విడుదల చేయలేకపోతున్నామని రాజమౌళి తెలిపాడు.

మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతున్నందున మే 20వ తేదీ వరకి షూట్ చేసి రివీల్ చేయడం కష్టమే. అదీ గాక లాక్డౌన్ ఎత్తేసినా కూడా షూటింగ్స్ కి అనుమతులు లభించకపోవచ్చు. అందువల్ల ఎన్టీఆర్ పుట్టినరోజున రామరాజు ఇచ్చే గిఫ్ట్ లేనట్టే..

No Gift for NTR birthday from Ramaraju..?:

No gifr for NTT on his birthday from Ramaraju

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ