కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్. సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ తరఫున ఆర్.బి.చౌదరి మరియు ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా 5 లక్షల విరాళాన్ని అందించారు. ఈ ఐదు లక్షల రూపాయలను శుక్రవారం నాడు ఆర్‌టిజిఎస్ ద్వారా సీసీసీకి పంపించారు.




 
                     
                      
                      
                     
                     ‘సీసీసీ’కి నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షలు
 ‘సీసీసీ’కి నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షలు

 Loading..
 Loading..