చెర్రీ విషయంలో జక్కన్నకు మాటిచ్చిన కొరటాల!

Fri 10th Apr 2020 12:14 PM
koratala siva,promise,jakkanna,ramcharan,aacharya,young megastar,chiru aacharya  చెర్రీ విషయంలో జక్కన్నకు మాటిచ్చిన కొరటాల!
Koratala Promise To Jakkanna.. Over Cherry Issue చెర్రీ విషయంలో జక్కన్నకు మాటిచ్చిన కొరటాల!
Sponsored links

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ మెగాస్టార్‌గా నటిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎస్.. చెర్రీ నటిస్తున్నాడు’ అని చిరు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. ప్రస్తుతం ఓటమెరుగని దర్శకధీరుడు జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’తో చెర్రీ బిజిబిజీగా ఉన్నాడు. దీంతో జక్కన్న-కొరటాల త్వరలోనే మాట్లాడుకుని డేట్స్ విషయంలో ఓ నిర్ణయానికి వస్తారని కూడా చిరు చెప్పేశారు.

కండిషన్స్ అప్లై..

తాజాగా.. వారిద్దరూ మాట్లాడుకోవడం కూడా అయిపోయిందట. నెల రోజుల పాటు చెర్రీని తనకివ్వాలని.. వీలైతే అంతకుముందే షూటింగ్ పూర్తి చేసేస్తానని జక్కన్నకు కొరటాల మాటిచ్చాడట. అయితే ఇందుకు స్పందించిన జక్కన్న లాక్‌డౌన్ అవ్వగానే చెర్రీకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించుకోవాలని ఆ తర్వాత అయితే కుదరదని.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కండిషన్స్ పెట్టాడట. దీనికి అంగీకరించిన కొరటాల థ్యాంక్స్ చెప్పాడట. సో.. జక్కన్న, కొరటాల మధ్య మాటలు అయిపోయాన్న మాట. 

సురేఖ కోరిక నెరవేరినట్లే..!

కాగా.. చెర్రీ తాను ఇద్దరం ఒక సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌గా నటించాలన్నది సురేఖ (చెర్రీ మదర్) కోరిక అని ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చెప్పిన విషయం విదితమే. సో.. సురేఖ కోరిక త్వరలోనే నెరవేరనున్నది అన్న మాట. ప్రస్తుతం సోషల్ దీని తాలుకూ వార్తలు చదవిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. ఫస్ట్ లుక్ ఎప్పుడో అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే చెర్రీని కలిసి కొరటాల ఆయనకు సంబంధించిన కథ వినిపించాలని అనుకుంటున్నాడట. కాగా.. యంగ్ మెగాస్టార్‌ చెర్రీ నటిస్తాడని.. ఈ సినిమాకు ఈ పాత్రే ఊపిరి అని.. చెర్రీ సరసన రష్మిక మందన్నా నటిస్తున్నట్లు ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Sponsored links

Koratala Promise To Jakkanna.. Over Cherry Issue:

Koratala Promise To Jakkanna.. Over Cherry Issue  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019