మహేశ్‌ను వదిలేసి చెర్రీని ఒప్పించే యోచనలో వంశీ!

Thu 09th Apr 2020 03:07 PM
vamsi paidipally,ramcharan,mahesh babu,evadu combo,mega compound  మహేశ్‌ను వదిలేసి చెర్రీని ఒప్పించే యోచనలో వంశీ!
Vamsi Paidipally Change His Route! మహేశ్‌ను వదిలేసి చెర్రీని ఒప్పించే యోచనలో వంశీ!
Sponsored links

టాలీవుడ్‌లో కొందరు దర్శకుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో.. ఎలా మారిపోతుందో ఎవరికీ అర్థం కాదు. హిట్ అందుకున్న హీరోలే మళ్లీ అదే డైరెక్టర్‌తో సినిమా అంటే ఒకటికి వందకాదు వెయ్యిసార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే వంశీ పైడిపల్లి ఎదుర్కొంటున్నాడు. ‘మహర్షి’ మూవీతో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాంచి హిట్టిచ్చాడు వంశీ.. అయితే మళ్లీ సినిమా అంటే స్క్రిప్ట్ సర్లేదు.. మార్పులు చేయాలి.. అది ఇదీ అని ముఖం చాటేస్తున్నాడు. దీంతో మహేశ్‌ను ఏమీ అనలేక.. వేరే హిరోతో సినిమా తీయలేక సుమారు రెండు మూడు నెలలుగా ఆయన సతమతం అవుతున్నాడు.

అయితే.. మహేశ్ పదే పదే తనను పక్కనెట్టేసి.. పరుశురామ్‌కు (గీతాగోవిందం డైరెక్టర్) చాన్స్ ఇస్తుండటంతో ఇక చేసేదేమీ లేక.. తన రూట్‌ను మార్చేయాలని భావించాడట. మహేశ్‌ను పూర్తిగా పక్కనెట్టేసి మెగా కంపౌండ్‌లోకి అడుగుపెట్టాలని ఫిక్స్ అయిపోయాడట. ఈ క్రమంలో మహేశ్ కోసం అనుకున్న కథలో మార్పులు చేర్పులు చేసి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు వినిపించాలని అనుకుంటున్నాడట. 

వాస్తవానికి.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చెర్రీ కూడా ఎవరితో సినిమా చేయాలనే దానిపై ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటికే చాలా మంది కథలు చెప్పినప్పటికీ ఏదీ ఫైనల్ చేయలేదు. ఈ క్రమంలో కచ్చితంగా తన కథ చెర్రీకి నచ్చుతుందని.. స్టోరీ లైన్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడని వంశీ తహతహలాడుతున్నాడట. అంతేకాకుండా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎవడు’ సూపర్ హిట్ అవ్వడంతో వంశీ రేంజ్ ఏంటో చెర్రీగా పూర్తిగా తెలుసు. మరి వంశీ రూట్ మార్చిన విషయంలో నిజమెంత..? నిజంగానే చెర్రీకి స్టోరీ చెప్పాలని వంశీ భావిస్తున్నాడా..? అనేదానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

Sponsored links

Vamsi Paidipally Change His Route!:

Vamsi Paidipally Change His Route!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019