ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు

Wed 08th Apr 2020 04:22 PM
prabhas,fans,serious,movie banners,young rebel star  ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు
Prabhas Fans waiting for Their Hero Movie Update ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు
Sponsored links

ప్రభాస్ బాహుబలి కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూసిన ఫ్యాన్స్‌కి రాజమౌళి ఎప్పటికి మరిచిపోలేని గిఫ్ట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందించడం ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చెయ్యడం జరిగింది. బాహుబలి కోసం ఎదురు చూసిన.. వారికీ తగిన ఫలితం దక్కింది. ఇక సాహో కోసం ప్రభాస్ అలానే ఫ్యాన్స్‌ని తెగ వెయిట్ చేయించాడు. కానీ సాహో దెబ్బ మాములుగా తగల్లేదు. ఇక సాహో పూర్తయ్యాక రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ సినిమా చేస్తున్న ప్రభాస్.. ఆ సినిమా విషయంలో ఆచి తూచి ఫ్యాన్స్‌ని వెయిట్ చేయిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ చూద్దామా.. ఎప్పుడెప్పుడు ప్రభాస్ కొత్త టైటిల్ విందామా అన్న ఫ్యాన్స్ కి అడుగడుగునా నిరాశే అన్నట్టుగా ఉంది. కరోనాతో లాక్ డౌన్ తో ప్రభాస్ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

దానితో ఈ సినిమా అప్ డేట్ కి అడ్డం పడింది. తాజాగా రాధాకృష్ణ కూడా ఫ్యాన్స్‌ని ఉసూరుమనిపించేసాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నాము. కరోనా వైరస్ నుండి విముక్తి పొందిన తర్వాత మళ్లీ మీ ముందుకు ఫ్రెష్ అప్ డేట్స్ తో వస్తాం. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌ని, దర్శకుడు రాధా కృష్ణ.. నిర్మాతలు యువీ వారు కలిసి హర్ట్ చేసారు. ప్రభాస్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉంటే... ఇలా కరోనా వైరస్ ప్రభాస్ ఫ్యాన్స్ అసలు మీద నీళ్లు చల్లింది.

Sponsored links

Prabhas Fans waiting for Their Hero Movie Update:

Prabhas Fans Serious on His Movie Producers and Director 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019