‘పుష్ప’ లుక్ మస్తుగుండాదబ్బా..!

Wed 08th Apr 2020 04:01 PM
pushpa,first look,allu arjun,sukumar,allu arjun birthday  ‘పుష్ప’ లుక్ మస్తుగుండాదబ్బా..!
Allu Arjun and Sukumar film title Pushpa ‘పుష్ప’ లుక్ మస్తుగుండాదబ్బా..!
Sponsored links

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏఏ 20 ఫ‌స్ట్ లుక్ - ‘పుష్ప’ టైటిల్ ఖ‌రారు 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో రూపొందుతున్న‌ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ‘అల‌ వైకుంఠపురంలో’ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్ష‌కుల్లో కూడా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ని ఎనౌన్స్ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పుష్ప అనే టైటిల్ ని ఈ సినిమాకు ఖ‌రారు చేసిన‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు.  అంతేకాదు ఈ మూవీలో అల్లు అర్జున్ ఎలా ఉండ‌బోతున్నారో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తెరదించుతూ అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుద‌ల చేయ‌డం విశేషం. అల్లు అర్జున్ అభిమానుల‌కే కాదు మాస్ మ‌సాల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే రేంజ్ లో ఈ ఫ‌స్ట్ లుక్ ని రెడీ చేసిన‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ & సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే బన్నీ & దేవి కాంబినేషన్ లో వచ్చిన బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మ్యూజిక్ లవర్స్ తో పాటు డాన్స్ లవర్స్ ను కూడా ఆకట్టుకోబోతోంది. 

 

ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేస్తారు.

 

నటీనటులు :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)

రష్మిక మందన్న (హీరోయిన్)

 

సాంకేతిక నిపుణులు : 

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 

సహ నిర్మాత - ముత్తంశెట్టి మీడియా

డైరెక్టర్: సుకుమార్

ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై

కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్

మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్

ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్

ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక

సి.ఈ. ఓ: చెర్రీ

లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి

పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను - మధు

Sponsored links

Allu Arjun and Sukumar film title Pushpa:

Pushpa Movie first Look released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019