అంత తీరిక ఎక్కడిది.. అవన్నీ రూమర్సే: పూజా

Tue 07th Apr 2020 07:00 PM
pooja hegde,clarity,dating,love,affair,bollywood hero son  అంత తీరిక ఎక్కడిది.. అవన్నీ రూమర్సే: పూజా
Pooja Hegde about Rumours on her అంత తీరిక ఎక్కడిది.. అవన్నీ రూమర్సే: పూజా
Sponsored links

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. బాలీవుడ్ లో క్రేజీగా పేరుతెచ్చుకుంటున్న పూజ హెగ్డే ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అది ఏ సినిమానో క్లారిటీ ఇవ్వకుండా ఓ తమిళ సినిమా మాత్రం 2020 లో చేస్తా అంటుంది. అయితే పూజా హెగ్డే బాలీవుడ్ నటుడితో డేటింగ్ లో ఉందని... అతనితో త్వరలోనే పెళ్లిపీటలెక్కే ఛాన్స్ ఉందని.. కానీ పూజా హెగ్డే ఆ ఎఫైర్ ని సీక్రెట్ గా మెయింటింగ్ చేస్తుంది అని మాములుగా ప్రచారం జరగడం లేదు.. మరి మేడం పూజా హెగ్డే నిజంగానే బాలీవుడ్ హీరో వినోద్ మెహ్రా కొడుకు రోహాన్ మెహ్రాతో  లవ్ లో ఉందని అందరూ ఫిక్స్ అవుతుంటే.. పూజా హెగ్డే మాత్రం తూచ్ అంటుంది.

రోహన్ పూజా హెగ్డే కలిసి ఉన్నప్పుడు కొంతమంది ఫొటోస్ తీసి ఇలాంటి రూమర్స్ సృష్టించడంతో క్లారిటీ ఇచ్చిన పూజా.. నేను రోహాన్ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుంది. కానీ పూజా నిజంగానే రోహన్ తో ప్రేమలో ఉందని  ప్రచారం జోరుగా జరగడంతో పూజా హెగ్డే లైన్ లోకొచ్చి.. మేము మంచి ఫ్రెండ్స్ కానీ లవర్స్ మాత్రం కాదు.. అంటూ అందరిలా కబుర్లు చెబుతుంది. ప్రస్తుతం సినిమాల్తో బిజీగా ఉన్న నేను ప్రేమలో పడేంత తీరిక లేదంటూ కబుర్లు చెబుతుంది.

Sponsored links

Pooja Hegde about Rumours on her:

Pooja Hegde clarity on love and Dating with Bollywood actor son

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019