యంగ్ హీరోయిన్‌.. విలన్‌గా వస్తోంది

Tue 07th Apr 2020 06:14 PM
adithi rao hydari,villain,v movie,nani,sudheer babu,indraganti mohan krishna  యంగ్ హీరోయిన్‌.. విలన్‌గా వస్తోంది
Aditi Rao Hydari Villain in Indraganti V Movie యంగ్ హీరోయిన్‌.. విలన్‌గా వస్తోంది
Sponsored links

హీరోయిన్స్ ఓ రేంజ్ దాటి వచ్చాక నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ చేయడమనేది కొత్తేమీకాదు. కాజల్ అగర్వాల్ సీత సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ తో మెప్పించింది. అయితే ఇప్పుడు త్వరలో విడుదల కాబోయే సినిమాలో మరో హీరోయిన్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపించబోతుంది. నాని - సుధీర్ బాబు కాంబోలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా గత నెల ఉగాదికి విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఆ సినిమా ఎప్పుడు మళ్ళీ విడుదలవుతుంది ప్రస్తుతం చెప్పలేము కూడా. అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో, నాని విలన్.

ఈ సినిమాపై అందరిలో పిచ్చ ఆసక్తి ఉంది. హీరో నాని ఈ సినిమాలో విలన్ కేరెక్టర్ చెయ్యడంతో సినిమాపై అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది. అయితే తాజాగా ఇంద్రగంటి ఈ సినిమాలో మరో విలన్‌ని చూపించబోతున్నాడట. అది కూడా హీరోయిన్ అతిది రావు హైదరి క్యారెక్ట‌రైజేష‌న్‌లో కాస్త నెగిటీవ్ షేడ్స్ క‌నిపిస్తాయ‌ని టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అతిధి పాత్ర ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతుంద‌ని టాక్‌. దర్శకుడు ఇంద్ర‌గంటి త‌న పాత్ర‌ని డిజైన్ చేసిన విధానానికి హీరోయిన్ అతిది రావు మ‌రోసారి ఫిదా అయిపోయి ఈ వి సినిమాని వెంటనే ఒప్పేసుకుంది అంటున్నారు. నాని, సుధీర్ త‌ర‌వాత‌.. ప్రేక్ష‌కుల్ని త‌న వైపుకు తిప్పుకునే క్యారెక్ట‌ర్ ఆమెదే అంటూ ఓ కొత్త న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. 

Sponsored links

Aditi Rao Hydari Villain in Indraganti V Movie:

Young Heroine plays Villain role in V Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019