‘అలవైకుంఠపురములో’ రీమేక్ రైట్స్ కొనేశారోచ్!

Mon 06th Apr 2020 02:44 PM
allu arjun,ala vaikunthapurramulo,bollywood,trivikram,thaman  ‘అలవైకుంఠపురములో’ రీమేక్ రైట్స్ కొనేశారోచ్!
Ala Vaikunthapurramulo remake rights sold..? ‘అలవైకుంఠపురములో’ రీమేక్ రైట్స్ కొనేశారోచ్!
Sponsored links

ఈ సంక్రాంతికి వచ్చిన అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. సంక్రాంతికి పోటీగా విడుదలయిన వేరే చిత్రాలపై స్పష్టమైన మెజారిటీ అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని వచ్చిన అల్లు అర్జున్ కి నాన్ బాహుబలి రికార్డ్ హిట్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

త్రివిక్రమ్ లావిష్ మేకింగ్, అల్లు అర్జున్ సూపర్ స్క్రీన్ ప్రెసెన్స్, థమన్ పాటల భీభత్సం సహా అన్నీ కలిసి వచ్చి సినిమాని బ్లాక్ బస్టర్ని చేశాయి. మరి ఇంతటి రికార్డులని క్రియేట్ చేసిన సినిమాపై ఇతర భాషల నిర్మాతల కళ్ళు పడటం సహజమే. అందుకే ఈ సినిమాని హిందీలో తెరకెక్కించడానికి రీమేక్ రైట్స్ ని కొనుక్కున్నారట. 

కొంతకాలం నుండి బాలీవుడ్ జనాలకి తెలుగు సినిమాలు బాగా నచ్చుతున్నాయి. అర్జున్ రెడ్డి, టెంపర్ సినిమాల హిందీ రీమేక్ లు అక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి. అందుకే అలాంటి మరో విజయాన్ని అందుకునేందుకు అర్జున్ రెడ్డిని హిందీలోకి తీసుకెళ్ళిన నిర్మాత అలవైకుంఠపురములో రీమేక్ హక్కులని మంచి రేటుకి కొనుక్కున్నాడట. మరి ఈ రీమేక్ లో ఏ బాలీవుడ్ హీరో నటిస్తాడో చూడాలి.

Sponsored links

Ala Vaikunthapurramulo remake rights sold..?:

News are coming that Ala vaikunthapurramulo remake rights sold out

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019