చెప్పింది చేయమంటే అతి ఎందుకు : మనోజ్

Mon 06th Apr 2020 01:39 PM
manchu manoj,corona virus,covid19  చెప్పింది చేయమంటే అతి ఎందుకు : మనోజ్
Manchu Manoj serious on them చెప్పింది చేయమంటే అతి ఎందుకు : మనోజ్
Sponsored links

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇల్లు దాటి బయటకి రావాలంటే భయపడుతున్నారు. ఏం చేస్తే ఏమవుతుందోన్న భయంతో ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కరోనాని అరికట్టడానికి మనకున్న ఆయుధం లాక్ డౌన్ ఒక్కటే అన్న కారణంతో దాన్ని చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు. అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉంటే వైద్యులు, పోలీస్ సిబ్బంది, నర్సులు తమ ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు.

వారి కృషిని గుర్తించి దన్యవాదాలు తెలియజేసేందుకే చప్పట్లు కొట్టమని చెప్పారు. అయితే అలా చప్పట్లు కొడుతూ గల్లీ గల్లీ తిరుగుతూ సామాజిక దూరం పాటించడాన్ని మర్చిపోయారు కొందరు. ఇక నిన్నటికి నిన్న దీపాలు వెలిగించాలని చెబితే అంతటితో ఆగకుండా టపాసులు పేల్చి రచ్చ రచ్చ చేశారు. చెప్పినదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తమకి నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు చేయడం సరైనది కాదని సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలు సైత్రం మొత్తుకుంటున్నారు.

టపాసులు పేల్చడంతో చిరాకుకి గురైన హీరో మంచు మనోజ్ టపాసులు పేల్చమని ఎవడైనా చెప్పాడా.. ఎందుకు పేలుస్తున్నాడంటూ సీరియస్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా ఇటువంటి వాటి గురించి స్పందించాడు. ఇలా చేసేవారికి ప్రధాని చెప్పేది సరిగ్గా అర్థం అవ్వట్లేదో లేక సరిగ్గ అర్థం అయ్యేలా చెప్పట్లేదో ఎవ్వరికీ అర్థం కావట్లేదు.

Sponsored links

Manchu Manoj serious on them :

Manchu Manoj fired on them

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019