సౌందర్యతో నాకు ఎఫైర్ ఉంది కానీ..: జగ్గూ భాయ్

Mon 06th Apr 2020 05:11 PM
jagapathi babu,soundarya,affair,interview,friendship  సౌందర్యతో నాకు ఎఫైర్ ఉంది కానీ..: జగ్గూ భాయ్
Jagapathi Babu Talks about Soundarya సౌందర్యతో నాకు ఎఫైర్ ఉంది కానీ..: జగ్గూ భాయ్
Sponsored links

దివంగత నటి సౌందర్య చనిపోకముందు పెద్ద హీరోయిన్. ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్ను మూసిన విషయం తెలిసిందే. అయితే సౌందర్య కెరీర్ పీక్స్ లో ఉండగా ఆమెపై చాలా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. సౌందర్యకి నాగార్జునకి సంథింగ్ సంథింగ్ అంటూ అలాగే హీరో జగపతి బాబుకి సౌందర్యకి మధ్య ఎఫైర్ నడిచింది అంటూ చాలా న్యూస్ లు ప్రచారంలో ఉండేవి. అయితే తాజాగా సీనియర్ హీరో ప్రస్తుతం విలన్ కేరెక్టర్స్ చేస్తూ బిజీగా ఉన్న జగపతి బాబు సౌందర్యతో నాకు ఎఫైర్ ఉన్న మాట నిజమే అని చెప్పుకొచ్చాడు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ నాకు సౌందర్యకి అందరూ అనుకున్నట్టుగా ఎఫైర్ ఉందని.. అయితే అందరూ అనుకునే ఎఫైర్ అంటే లైంగిక మయిన ఎఫైర్ మా మధ్యన లేదని.. కానీ ఆత్మీయబంధం మా మధ్య ఉందని చెబుతున్నాడు.

సౌందర్య, నేను మాత్రమే కాదు.. సౌందర్య అన్నయ్య అమర్ మేము కూడా మంచి ఫ్రెండ్స్ అని... సౌందర్య తో  మాది ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ అని అందుకే సౌందర్య ఇంటికి నేను, మా ఇంటికి సౌందర్య వస్తూపోయేవాళ్లమని.. దానితో మా మధ్యన ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది అని.. అయితే ఎప్పుడూ నేను ఆ విషయాన్నీ సీరియస్ గా తీసుకోలేదని చెప్పాడు. అందరూ అనుకున్నట్టుగా మా మధ్యన అక్రమ సంబంధం లాంటిది లేదని.. మేమెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని చెబుతున్నాడు. తమపై వచ్చే రూమర్లని.. బాధగా కాకుండా కాంప్లిమెంట్ గా భావించేవాళ్లమని.. సౌందర్య నేను కూడా ఈ రూమర్స్ ని ఎప్పుడు సీరియస్ గా తీస్కోలేదని చెబుతున్నాడు.

Sponsored links

Jagapathi Babu Talks about Soundarya :

affair between Me and Soundarya says jagapathi Babu

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019