అమెరికాలో నేను సేఫ్‌గా ఉన్నా: రానా హీరోయిన్

Mon 06th Apr 2020 04:49 PM
rana heroine,richa gangopadhyay,actress richa,corona crysis,america  అమెరికాలో నేను సేఫ్‌గా ఉన్నా: రానా హీరోయిన్
Iam Safe In America Says Rana Heroine! అమెరికాలో నేను సేఫ్‌గా ఉన్నా: రానా హీరోయిన్
Sponsored links

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలు ఎక్కడోళ్లు అక్కడో నిలిచిపోయారు. అయితే.. ఇంకొదరిపై అయితే కరోనాతో చనిపోయారనే పుకార్లు కూడా వచ్చేస్తున్నాయ్. అయితే తాజాగా అప్పుడెప్పుడో ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘నాగవళ్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’ చిత్రాల్లో మెరిసి తెరమరుగైపోయిందే ఆ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ గురించి హాట్ టాపిక్ అయ్యింది. చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడి కుర్రాడినే పెళ్లి చేసుకుందీ భామ. 

కరోనాతో అమెరికాలో మరణ మృదంగం మోగుతోంది. రోజుకు ఎంతమంది ఈ వైరస్‌తో చనిపోతున్నారో అస్సలు లెక్కేలేకుండా పోయింది. ఈ తరుణంలో అసలు రీచా  పరిస్థితేంటి..? ఎలా ఉంది..? ఏమైపోయింది.. ఇంతకీ ఆమె సేఫ్‌గా ఉందా లేదా..? అని పలువురు నెటిజన్లు ఆరాతీయడంతో పాటు.. ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు చేయడంతో ఎట్టకేలకు స్పందించింది.

తాను సేఫ్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అందరికీ హాయ్ చెబుతూ.. మరోవైపు తాను నటించిన హీరోలను సైతం ఈ భామ గుర్తు చేసుకుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇలా చాలా సేపే అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిచ్చింది. ఇదిలా ఉంటే.. మళ్లీ సినిమాల్లో నటిస్తారా..? తెలుగులో ఎప్పుడు నటిస్తారు..? అని అడగ్గా ఈ మాటలకు మాత్రం రిచా రియాక్ట్ అవ్వల్లేదు. మొత్తానికి చూస్తే సినిమాలకు ఈ భామ ఇక గుడ్ బాయ్ చెప్పేసినట్లేనని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Sponsored links

Iam Safe In America Says Rana Heroine!:

Iam Safe In America Says Rana Heroine!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019