లాక్ డౌన్ వేళ ఆత్మకథ రాస్తున్న చిరంజీవి..

Sun 05th Apr 2020 02:17 PM
megastar churanjeevi,autobiography,ramcharan   లాక్ డౌన్ వేళ ఆత్మకథ రాస్తున్న చిరంజీవి..
Megastar busy with Writing Autibiography లాక్ డౌన్ వేళ ఆత్మకథ రాస్తున్న చిరంజీవి..
Sponsored links

కరోనా కారణంగా తన ఆచర్య సినిమా షూటింగుని అందరికంటే ముందే ఆపేసిన చిరంజీవి లాక్ డౌన్ ని చాలా పద్దతిగా పాటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా రోజువారి సీనీ కార్మికుల పనులన్నీ ఆగిపోవడంతో వారికి సాయం చేయడానికి కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనా వేళ చిరంజీవి తన ఆత్మకథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడట.

అసలే బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. చిరంజీవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చి హీరోలయినా వారెందరో ఉన్నారు. చిరంజీవి డాన్సులు చూసి డాన్స్ నేర్చుకున్న వాళ్ళెందరో.. అయితే ఆ స్ఫూర్తిని మనలో కలిగించడానికి చిరంజీవి సిద్ధమయ్యాడట. పుస్తకరూపంతో పాటు వీడియో రూపంలో ఆవిష్కరించబోతున్న ఆత్మకథని రోజూ కొద్ది కొద్దిగా రాస్తున్నాడట.

అంతేకాదు ఈ లాక్ డౌన్ సమయంలోకిచెన్ లో దూరి దోసలు వేస్తున్నాడట. మొక్కలకి నీళ్ళు పోయడం..పాత సినిమాలు చూడటం కాలక్షేపంగా లాక్ డౌన్ ని గడుపుతున్నాడట. చిరంజీవి ఆత్మకథ రాస్తున్నాడంటే ప్రతీ ఒక్క సినీ ప్రేక్షకుడు ఆనందిస్తాడు.. ఎదురుచూస్తాడు. మరి ఆ పుస్తకం ఎప్పుడు విడుదల అవుతుందో..

Sponsored links

Megastar busy with Writing Autibiography:

Megastar writing busy with writing Autobiography

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019