వి సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Sat 04th Apr 2020 12:48 PM
v the movie,nani,sudheer babu,aditi rao hydari,nivetha thomas  వి సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Interesting update from V the movie వి సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Sponsored links

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి. మోహనక్రిష్ణ దర్శకత్వంలో నానీకి ఇది మూడవ చిత్రం. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో నటించిన అష్టా చమ్మా, జెంటిల్ మేన్ చిత్రాలకి మంచి ఫలితమే దక్కింది. ఇప్పుడు చేసిన వి సినిమాలో నాని నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. సుధీర్ బాబు రక్షకుడుగా కనిపిస్తుంటే, నాని రాక్షసుడి పాత్రలా ఉంటుందట.

ఇప్పటికే టీజర్ రిలీజ్ అయిన ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ బయటకి రావట్లేదు. టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిజానికి ఉగాది పర్వదినాన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో వి సినిమా రిలీజ్ వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తయితే కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంలో క్లారిటీ రాదు.

అయితే తాజాగా ఈ సినిమా ఒక అప్డేట్ బయటకి వచ్చింది. ఇంద్రగంటి మోహనక్రిష్ణ మొదటి సారి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ లో నివేథా థామస్ తో పాటు మరో హీరోయిన్ గా అదితీ రావ్ హైదరీ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో హైదరీ పాత్ర కూడా నానిలాగే నెగెటివ్ గా ఉండనుందట. ప్రొటాగనిస్ట్ పాత్రలో నటిస్తున్న సుధీర్ బాబుకి జోడీగా నివేథా కనిపిస్తుంటే నానీకి జోడీగా అదితీ నటిస్తుందని తెలుస్తుంది.

Sponsored links

Interesting update from V the movie:

Interesting update from Nani V the movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019