బాలయ్య కోటి 25 లక్షలు.. ఆయన అల్లుడు రూ. కోటి

Sat 04th Apr 2020 05:44 PM
balakrishna,sri bharath,help,donations,ccc,andhra pradesh,telangana,karnataka  బాలయ్య కోటి 25 లక్షలు.. ఆయన అల్లుడు రూ. కోటి
Balakrishna announced 1 Crore 25 lakhs and his son in law announces Rs 1 cr బాలయ్య కోటి 25 లక్షలు.. ఆయన అల్లుడు రూ. కోటి
Sponsored links

కేటీఆర్‌కు రూ 50 లక్షల చెక్ అందించిన నందమూరి బాలకృష్ణ

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి, 25 లక్షలు సినీ కార్మికుల సంక్షేమానికి అందజేస్తానని ప్రకటించారు. బాలకృష్ణ తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ను కలిసి సీఎం సహయనిధి కి రూ 50 లక్షల చెక్ ను అందచేశారు. ఇప్పటికే బాలకృష్ణ సినీ కార్మికుల సంక్షేమం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కి రూ 25 లక్షల చెక్ ను సి కళ్యాణ్‌కు అందించారు.

క‌రోనా నివార‌ణ కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ చైర్మన్ ఎమ్ శ్రీ భరత్ 1 కోటి రూపాయల విరాళం

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్  ఎమ్ శ్రీ భరత్ 1 కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి రూ. 50 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు, కర్ణాటక ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌నీ, ప్రజలు అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌నీ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Sponsored links

Balakrishna announced 1 Crore 25 lakhs and his son in law announces Rs 1 cr:

Balakrishna and His Son in law helps State governments

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019