భారీ విరాళం ప్రకటించిన బాలకృష్ణ

Fri 03rd Apr 2020 12:21 PM
corona relief,balakrishna,donation,huge donation,ccc,corona  భారీ విరాళం ప్రకటించిన బాలకృష్ణ
Balakrishna Announces Rs 1 Crore 25 Lakhs భారీ విరాళం ప్రకటించిన బాలకృష్ణ
Sponsored links

కరోనాపై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Sponsored links

Balakrishna Announces Rs 1 Crore 25 Lakhs:

>Corona Relief: Balakrishna Donates 1.25 Crores

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019