మోక్షజ్ఞకు ట్రైనింగ్.. ఎంట్రీ ఈ డైరెక్టర్‌‌తోనే!?

Fri 03rd Apr 2020 08:28 AM
balayya,balayya son,mokshagna,tollywood entry,mokshagna movie  మోక్షజ్ఞకు ట్రైనింగ్.. ఎంట్రీ ఈ డైరెక్టర్‌‌తోనే!?
Balayya Son Mokshagna Entry With These Director! మోక్షజ్ఞకు ట్రైనింగ్.. ఎంట్రీ ఈ డైరెక్టర్‌‌తోనే!?
Sponsored links

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ.. ఇదిగో వస్తున్నాడు.. అదుగో వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడహో అంటూ ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ ఎక్కడిదాకా వచ్చాడబ్బా అని నందమూరి వీరాభిమానులు ఎదురు చూసి చూసి అలిసిపోతున్నారు. ఆయన రాకపోగా అప్పుడప్పుడు షాకింగ్ లుక్‌తో కూడిన పిక్స్‌ బయటికి రావడంతో వామ్మో అని భయపడిపోతున్నారు. అయితే.. రావడం కాస్త లేట్ అవుతుందేమో కానీ పక్కాగా వచ్చేస్తాడు.. తీసుకొస్తున్నా అని బాలయ్య మరోసారి చెబుతున్నాడు. అందుకోసమే స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాడట.

వాస్తవానికి మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేయడానికి ఇప్పటికే బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. బాలయ్య ఊ అంటే చాలు రంగంలోకి దిగిపోతారు. అయితే వారి మీద నమ్మకం లేదో మరేమిటో కానీ.. ఈయన మాత్రం తనకు అట్టర్ ప్లాప్ సినిమాలిచ్చిన క్రిష్‌తో ఎంట్రీ ఇప్పిస్తున్నాడని తాజాగా టాలీవుడ్‌లో తెగ టాక్ నడుస్తోంది. ఇప్పటికే క్రిష్-బాలయ్య మధ్య ఎంట్రీ విషయమై చర్చలు కూడా సాగాయట. క్రిష్ డైరెక్టర్‌ అయితే బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తాడట. ప్రస్తుతం అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లో అంతగా రాణించలేకపోతున్న బాలయ్య.. ఇక మొత్తం దృష్టి మోక్షజ్ఞపైనే పెట్టాడట. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకునేందుకు కూడా బాలయ్య సిద్ధమయ్యాడట.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో క్రిష్ సినిమా ఉంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండటంతో ఇది పూర్తయ్యి రిలీజ్ కార్యక్రమాలు అవ్వగానే మోక్షజ్ఞ కోసం క్రిష్ రంగంలోకి దిగుతాడట. ఇవన్నీ ఒక ఎత్తయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్యకు కూడా ముఖ్య పాత్ర ఉంటుందట. అది.. పౌరాణిక చిత్రమని నందమూరి కుటుంబ సభ్యులు దాదాపు అందరూ కవర్ అయ్యేలా ఉంటుందట. ఇలాంటి కథే కావాలని పదే పదే క్రిష్‌ను బాలయ్య కోరాడట. మరి ఈ ఎంట్రీపై వస్తున్న పుకార్లలో ఏ మాత్రం నిజానిజాలున్నాయో.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు.

Sponsored links

Balayya Son Mokshagna Entry With These Director!:

Balayya Son Mokshagna Entry With These Director!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019