వాళ్లే నా జీవితం..పూజా హెగ్డే..

Wed 01st Apr 2020 02:55 PM
pooja hegde,prabhas,o dear,tollywood  వాళ్లే నా జీవితం..పూజా హెగ్డే..
Those are my life....Pooja Hegde వాళ్లే నా జీవితం..పూజా హెగ్డే..
Sponsored links

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. స్టార్ హీరోల సరసన నటించడానికి ఏకైక ఛాయిస్ గా మారిన పూజాకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. మొన్నటి వరకు ప్రభాస్ సినిమా కోసం జార్జియా వెళ్ళొచ్చిన పూజా కరోనా కలకలం కారణంగా ఇంటిలోనే ఉంటుంది. అదే కాకుండా లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే గడుపుతూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గర అవుతుంది.

నేడు సోషల్ మీడియాలో అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని తెలుగు ప్రేక్షకుల గురించి మీరేం ఫీల్ అవుతున్నారై అడిగాడు. దానికి పూజా తెలుగు ప్రేక్షకులే నా జీవితం అంటూ సమాధానం ఇచ్చింది. తెలుగు చిత్రాల ద్వారా ఆమెకి వచ్చిన పాపులారిటీ వల్ల ఆమెకి తెలుగు ప్రేక్షకులే జీవితం అయ్యారని చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే ఇంకా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకి ఆమె ఈ విధంగా జవాబిచ్చింది. షారుక్ ఖాన్ కింగ్ ఆఫ్ రొమాన్స్ అనీ, తలైవా రజనీ కాంత్ ని లెజెండ్ అనీ, హీరో నానీని తెలివైన నటుడంటూ పేర్కొంది. మొత్తానికి బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు తెచ్చుకుంటున్న పూజా తెలుగు ప్రేక్షకులకి మంచి స్థానమే ఇచ్చింది. 

Sponsored links

Those are my life....Pooja Hegde:

Pooja hegde says about Telugu Audience

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019