కరోనా వైరస్ పై పాట పాడిన ఆర్జీవీ..

Tue 31st Mar 2020 02:27 PM
ram gopal varma,corona virus,covid 19  కరోనా వైరస్ పై పాట పాడిన ఆర్జీవీ..
Ram gopal varma song on coronavirus కరోనా వైరస్ పై పాట పాడిన ఆర్జీవీ..
Sponsored links

వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా కరోనా వైరస్ పై వరుస ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. కరోనాని తరిమి కొట్టాలంటే లాక్ డౌన్ ఒకటే పరిష్కారమని నమ్ముతున్న ప్రభుత్వానికి రామ్ గోపాల్ వర్మ పూర్తి మద్దతుని ఇస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జోక్స్, మీమ్స్ తో తన సెటైరికల్ అభిప్రాయాలని పంచుకుంటున్నాడు.

ఇంకా మందు కనుగొనబడని ఈ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నివారణ ఒక్కటే మార్గం. అందుకే ఈ నివారణకై సామాన్య జనాలకి అవేర్ నెస్ కలిగించడానికి టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీస్ అందరూ ముందుకు వచ్చారు. చిరంజీవి నేతృత్వంలో కరోనా వైరస్ పైన అవగాహన కలిగించడానికి సెలెబ్రిటీలంతా కలిసి పాట పాడి మరీ జనాల్లోకి తీసుకెళ్ళారు. ఈ పాటపై వర్మ తనదైన శైలిలో సెటైర్ వేసిన సంగతి తెలిసిందే.

అయితే అక్కడితో ఆగకుండా వర్మ కూడా కరోనా మీద ఒకా పాట రెడీ చేశాడు. తానే రాసి మరీ పాడిన ఈ పాటకి కనిపించని పురుగు అనే నామకరణం చేశాడు. ఈ పాటని రేపు రిలీజ్ చేయబోతున్నాడట. కరోనా గురించి రిలీజ్ చేస్తున్న ఈ పాటని చేతులు కడుక్కొని వినమని చెప్తున్నాడు. 

Sponsored links

Ram gopal varma song on coronavirus:

Ram gopal varma song on coronavirus

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019