పోలీస్ సోదరులకీ నిఖిల్ భారీ సాయం

Wed 01st Apr 2020 11:22 AM
nikhil,help,police force,corona virus,covid 19,hero nikhil  పోలీస్ సోదరులకీ నిఖిల్ భారీ సాయం
Hero Nikhil Siddharth Helps Police force పోలీస్ సోదరులకీ నిఖిల్ భారీ సాయం
Sponsored links

క‌రోనాపై యుద్ధం చేస్తున్న పోలీస్ సోద‌రుల‌కి భారీగా శానిటైజ‌ర్స్ అందించిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ‌

మ‌హామ్మారి కరోనా పై యావ‌త్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మ‌న దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా నివార‌ణ‌కు అన్ని విధాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమైత‌న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు, పోలీస్ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది పొంచి ఉన్న ప్ర‌మాదాన్ని లెక్క చేయ‌కుండా మ‌నంద‌రి కోసం పని చేస్తున్నారు. ముందుగా వారంద‌రి సుర‌క్ష‌ణ‌ మ‌నంద‌రి ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యం. అందుకే వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌లంతా పోలీస్, వైద్య సిబ్బందికి చేయూత‌గా త‌మ‌కు తోచిన స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తున్నారు. తెలుగు చిత్ర‌సీమ నుంచి కూడా కొంద‌రు హీరోలు, నిర్మాత‌లు ఇప్ప‌టికే క‌రోనా నివార‌ణ‌కు ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంలో ఆర్ధిక స‌హాకారం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ సైతం ఇటీవ‌లే 8 ల‌క్ష‌ల విలువ చేసే మాస్కులు, శానిట‌రీ కిట్లు వివిధ ఆసుప‌త్రుల్లో ఉన్న వైద్య‌ులకు అందించారు. తాజాగా వివిధ ఏరియాల్లో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి శానిటైజ‌ర్లు అంద‌జేశారు. ఈ ప‌రంప‌ర ఇంకా కొన‌సాగిస్తున్న‌ట్లుగా నిఖిల్ సిద్ధార్థ తెలిపారు.

Sponsored links

Hero Nikhil Siddharth Helps Police force:

After Doctors, Hero Nikhil helps Police force

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019