బాలీవుడ్ అవకాశం తెచ్చిపెట్టిన పాట..

Sun 29th Mar 2020 01:07 PM
devi sri prasad,bollywood,radhe,prabhudeva  బాలీవుడ్ అవకాశం తెచ్చిపెట్టిన పాట..
Devi Sri Prasad got a chance in bollywood బాలీవుడ్ అవకాశం తెచ్చిపెట్టిన పాట..
Sponsored links

గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ కి గడ్డుకాలం నడుస్తోంది. ఆయన చేసే పాటల్లో కొత్తదనం లేదని పాత ట్యూన్లనే మార్చి మార్చి మళ్ళీ కొడుతున్నాడని విమర్శించారు. ఒకపక్క థమన్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకులని తెగ ఆకర్షిస్తుంటే, దేవి పాటలు తేలిపోయాయి. దాంతో దేవి పని అయిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పై కొంత ఒత్తిడి పెరిగిందన్నది వాస్తవం.

ఈ నేపథ్యంలో ఆయనకి అవకాశాలు కూడా తగ్గాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ ప్రయారిటీగా ఉన్న దేవి ప్రస్తుతం సెకండ్ ఛాన్స్ అయిపోయాడు. అయితే దేవికి బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. అది కూడా బాలీవుడ్ బాద్ షా సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న రాధే సినిమాలో దేవికి ముడు పాటలు చేసే అవకాశం వచ్చింది.

గతంలో ప్రభుదేవా దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలకి దేవి సంగీతం అందించిన సాన్నిహిత్యం ఉండడంతో సల్మాన్ ఖాన్ ని రిఫర్ చేసాడట. మహర్షి సినిమాలోని చోటీ చోటీ బాతే అనే పాటని విన్న సల్మాన్ ఖాన్ దేవిని ఒప్పుకున్నాడట. మొత్తానికి దేవికీ మంచి అవకాశమే వచ్చింది.

Sponsored links

Devi Sri Prasad got a chance in bollywood:

Devi got a chance in bollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019