పవన్ ద్విపాత్రాభినయం ఎలా సాధ్యం..?

Sun 29th Mar 2020 10:48 PM
pawan kalyan,krish,duel role,not possible,theenmaar  పవన్ ద్విపాత్రాభినయం ఎలా సాధ్యం..?
Rumours on Pawan Kalyan role in Krish Movie పవన్ ద్విపాత్రాభినయం ఎలా సాధ్యం..?
Sponsored links

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక్క తీన్‌మార్ తప్ప మరే సినిమాలోనూ ద్విపాత్రాభినయం చెయ్యలేదు. అయితే ప్రస్తుతం క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే డ్యూయెల్ రోల్ చేస్తున్నాడా? అనే దానిమీద క్లారిటీ లేక ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ లో లాయర్ గా నటిస్తున్నాడు. ఇక క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోహినీర్ వజ్రాన్ని దొంగలించే దొంగగా కనబడతాడని అంటున్నారు.

ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథ ప్రకారం ప‌వ‌న్ తండ్రి, అన్న లాంటి పాత్ర‌లు ఈ సినిమాలో ఉండవు. పైగా ఈ సినిమా క‌థంతా.. పిరియాడిక‌ల్ డ్రామానే కాబట్టి ఇందులో ఫ్లాష్ బ్యాక్... లాంటి స్టోరీస్ ఏమి ఉండవు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు ఎలా చేస్తాడు. అసలు క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం అంటూ గాసిప్ ఎందుకు బయలుదేరిందో కూడా అర్ధం కావడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గజ దొంగగా కనబడే క్రిష్ మూవీ 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కరోనా తో కాస్త ఆలస్యమైన షూటింగ్ అనుకున్న టైం కే క్రిష్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు నిలబెట్టగలడని పవన్ ఫాన్స్ ధీమాతో ఉన్నారు.

Sponsored links

Rumours on Pawan Kalyan role in Krish Movie:

Pawan Kalyan no duel role in Krish Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019