మరో మెగా హీరో సినిమాలో లావణ్య.. నిజమేనా?

Sun 29th Mar 2020 02:39 PM
lavanya tripathi,mega hero,boxer,pawan kalyan,varun tej  మరో మెగా హీరో సినిమాలో లావణ్య.. నిజమేనా?
Lavanya Tripathi in one mega Hero film మరో మెగా హీరో సినిమాలో లావణ్య.. నిజమేనా?
Sponsored links

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫేడవుట్ కి దగ్గరగా ఉన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ వదులుతూ దర్శకనిర్మాతల కోసం ఆశగా ఎదురు చూస్తుంది. లావణ్య త్రిపాఠికి అవకాశం ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. అయితే ఈమధ్యన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ భార్యగా లావణ్య త్రిపాఠి ఫైనల్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే అది నిజామా లేదా అనేది క్లారిటీ లేకుండా ఇప్పుడు లావణ్య పై మరో న్యూస్ ప్రచారంలోకొచ్చింది.

అదేమంటే వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్న సినిమాలో అత్యంత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ కోసం హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని తీసుకోబోతున్నట్టుగా మరో న్యూస్ వినబడుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా సయీ మంజ్రేకర్ అనే అమ్మాయి వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం లావణ్య త్రిపాఠిని సంప్రదించినట్టుగా చెబుతున్నారు. మరి మొన్న పవన్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం లావణ్య అన్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ కోసం లావణ్య అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Sponsored links

Lavanya Tripathi in one mega Hero film:

Lavanya tripathi in varun tej Boxer Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019