Advertisementt

కొమరంభీమ్ గిఫ్ట్ అదిరిపోయింది..

Fri 27th Mar 2020 06:23 PM
bheemforramaraju,ntr,ramcharan,rajamouli  కొమరంభీమ్  గిఫ్ట్ అదిరిపోయింది..
Fantastic gift for Ramaraju.. కొమరంభీమ్ గిఫ్ట్ అదిరిపోయింది..
Advertisement
Ads by CJ

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ వచ్చిన రెండు రోజుల్లోనే మరో అఫ్డేట్ తో మన ముందుకు వచ్చారు రాజమౌళి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కొమరం భీమ్ ఎన్టీఆర్ రామరాజుకి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తానన్న ఈ గిఫ్ట్ రాజమౌళి అభిప్రాయం తెలుసుకోవడం వల్ల కొంచెం ఆలస్యమై నాలుగు గంటలకి రిలీజ్ చేశారు. నిమిషం కంటే ఎక్కువ ఉన్న ఈ వీడియోతో రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా కొమరం భీమ్ పరిచయం చేశాడు.

ఈ వీడియో ఆద్యంతం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఎన్టీఆర్ వాయిస్ లోని గాంభీర్యం, రామరాజుని పరిచయం చేసిన తీరు, తెలంగాణ మాండలికం.. అన్నీ కలిపి ఒక ఎమోషనల్ టచ్ తో రామరాజుని పరిచయం చేశాడు. రామరాజుని పరిచయం చేస్తూ నా అన్న మన్నెందొర అన్నప్పుడు ఎన్టీఆర్ వాయిస్ లోని గాంభీర్యతకి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ వీడియో ద్వారా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 

అప్పటి వరకు మనం ఊహించినదానికంటే విభిన్నంగా రామ్ చరణ్ కనిపించాడు. కండలు తిరిగిన దేహం, ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో విల్లుతో, ఒక టైమ్ లో పోలీస్ డ్రెస్ తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొత్తానికి ఎవ్వరూ ఊహించని విధంగా కొమరంభీమ్ ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది. 

Fantastic gift for Ramaraju..:

Komaram bheem gift for Ramaraju

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ