సీఎంకు రూ. 10 ల‌క్ష‌ల చెక్‌ అంద‌జేసిన నితిన్‌

Wed 25th Mar 2020 05:17 PM
nithiin,10 lakh cheque,cm kcr,telangana,corona virus  సీఎంకు రూ. 10 ల‌క్ష‌ల చెక్‌ అంద‌జేసిన నితిన్‌
As Announced, Hero Nithiin Hands Over 10 Lakh Cheque To CM KCR సీఎంకు రూ. 10 ల‌క్ష‌ల చెక్‌ అంద‌జేసిన నితిన్‌
Sponsored links

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసి రూ. 10 ల‌క్ష‌ల చెక్‌ను అంద‌జేసిన హీరో నితిన్‌

ప్ర‌క‌టించిన‌ట్లుగానే క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు విరాళం అంద‌జేశారు హీరో నితిన్‌. మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావును క‌లిసిన ఆయ‌న రూ. 10 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నితిన్‌ను అభినందించిన కేసీఆర్ ఆయ‌న‌ను ఆప్యాయంగా కౌగ‌లించుకున్నారు. నితిన్ సేవా దృక్ప‌థాన్ని ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా నితిన్ మాట్ల‌డుతూ, క‌రోనా వ్యాప్తి నిరోధ కార్య‌క్ర‌మాల విష‌యంలో సీఎం కేసీఆర్ గారు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని కొనియాడారు. కేసీఆర్ గారి స్ఫూర్తితో ప్ర‌జలంద‌రూ లాక్‌డౌన్‌కు పూర్తిగా స‌హ‌క‌రించి క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ అమ‌లులో ఉన్నందున వీలైనంత‌ త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌నరెడ్డి గారిని క‌లుసుకొని, ఏపీ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి తాను ప్ర‌క‌టించిన రూ. 10 ల‌క్ష‌ల‌ను అంద‌జేస్తాన‌ని నితిన్‌ తెలిపారు.

Sponsored links

As Announced, Hero Nithiin Hands Over 10 Lakh Cheque To CM KCR:

Nithiin Hands Over 10 Lakh Cheque To Telangana CM

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019