ఉగాది రోజున చిరు అభిమానులకి మెగా గిఫ్ట్..

Tue 24th Mar 2020 11:48 AM
chiranjeevi,megastar,social media,mega family  ఉగాది రోజున చిరు అభిమానులకి మెగా గిఫ్ట్..
Chiru grand entry int o social media ఉగాది రోజున చిరు అభిమానులకి మెగా గిఫ్ట్..
Sponsored links

సాధారణంగా ప్రతీ పండగకీ సినిమా వాళ్ల నుండి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఆ రోజు కొత్త సినిమా లాంచ్ అవడమో లేక షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం నుండి ఏదైనా పాటని రిలీజ్ చేయడమో, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడమో చేస్తుంటారు. పండగరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అప్డేట్స్ అన్నీ అదేరోజు ఇవ్వడానికి ఉత్సాహ పడుతుంటారు. 

ప్రతీ పండక్కి ఏదో ఒక సందడిని చూపించే సినిమా వాళ్ళు ఈ ఉగాది రోజు ఎలాంటి సందడిని తీసుకురావట్లేదు. దానికి కారణం కరోనా వైరస్. కరోనా వైరస్ ఇళ్లలో నుండి కదలకుండా చేసి అనేక ఆనందాలని మిస్ చేస్తుంది. తెలుగు వారికి పర్వదినమైన ఉగాదిరోజున ఒక్కటంటే ఒక్క సినిమా అప్డేట్ లేదు. అయితే ఆ కొరతని తీర్చడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నాడు.

ఉగాది పర్వదినాన చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాడు. తన భావాలని మనతో పంచుకోవడానికి, మనల్ని పలకరించడానికి, మనతో ఎన్నో చెప్పుకోవడానికి మనకోసం సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాడు. ఈ విషయమై ఓ వీడియో రూపంలో తన సందేశాన్ని తెలియజేశారు చిరంజీవి. ఈ వార్తతో చిరు అభిమానులకి పండగే..

Sponsored links

Chiru grand entry int o social media:

Megfastar chiranjeevi entering social media

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019