Advertisementt

షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగన..

Sun 22nd Mar 2020 02:56 PM
kangana,bollywood queen,nirbhaya  షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగన..
Kangana Shocking statement about Nirbhaya case షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగన..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలీవుడ్ లో ఉన్న ప్రముఖులందరితో ఆమెకి వివాదాలు ఉన్నాయి. కంగన, ఆమె సిస్టర్ రంగోళీ ఇద్దరూ తరచుగా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. నిర్భయ దోషులకి ఉరిశిక్ష పడ్డ విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్ళ తర్వాత నిర్భయకి న్యాయం జరిగిందని పలువురు కామెంట్లు చేశారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా నిర్భయ దోషుల విగ్రహాలు పెట్టాలని కామెంట్ చేసింది. అలాంటి తప్పు చేసినవారికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియాలంటే వారికి విగ్రహం పెట్టడమే కరెక్ట్ అని ఆమె వాదించింది. తప్పు చేసిన వారికి ఉరిశిక్ష పడుతుందన్న విషయాన్ని ప్రచారం చేస్తే ఇటువంటివి తగ్గుతాయని, ఆడవాళ్ళని చులకనగా చూస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయని తర్వాతి తరం గుర్తుంచుకోవాలంటే వారి విగ్రహాలు పెట్టాలని సూచించింది. స్ఫూర్తి కోసం మహానుభావుల విగ్రహాలు పెట్టినట్లుగానే భయం కోసం వాళ్ల విగ్రహాలని పెట్టాలని సూచిస్తుంది. కంగన వ్యాఖ్యల్ని పూర్తిగా వినని వారు ఇలాంటి చిత్రమైన కోరిక కోరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

Kangana Shocking statement about Nirbhaya case:

Knagana ranaut shocking comments on Nirbhaya case

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ