రీసెంట్ గా వెంకీ మామ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన కె.యస్ రవీంద్ర (బాబీ) కి గోల్డెన్ ఛాన్స్ లభించింది.. అందేంటంటే త్వరలో ఆయన మెగాస్టార్ నే డైరెక్ట్ చేయబోతున్నాడట. విషయానికి వస్తే వెంకీ మామ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర దర్శకుడు బాబీని తెగ అభినందించాడట. అప్పుడే ఏదైనా కథ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దాం అని మెగాస్టార్ బాబీతో అన్నట్లు సమాచారం. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవిని కలిసి బాబీ ఒక డిఫరెంట్ పాయింట్ చెప్పాడని తెలిసింది. మెగాస్టార్ కూడా బాబీ చెప్పిన లైన్ నచ్చి ఇంప్రెస్స్ అయి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చేసుకొని రమ్మని చెప్పారని సన్నిహిత వర్గాల్లో వినికిడి. ఇకన్నీ కుదిరితే మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో అవుట్ అండ్ కమర్షియల్ సినిమా రానుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రానుంది. ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలన్న కోరిక మైత్రికి ఈ చిత్రంతో నెరవేరబోతోంది..!!