తెలుగు పాపులర్ షో ‘జబర్దస్త్’ కామెడీ కింగ్‌గా నాటికీ నేటిగా రాణిస్తూనే ఉంది. యూట్యూబ్‌ను షేక్ చేస్తూ సదరు యాజమాన్యానికి ఆశించినదానికంటే గట్టిగానే కాసులు సంపాదించి పెడుతోంది. ఇందులో నటించే కంటెస్ట్‌లకు కంటెంట్ ఉండటం.. కామెడీ, యాక్టింగ్ ఇలా కలబోతగా ఉండటంతో షో ఎవరున్నా.. లేకున్నా.. టాటా చెప్పేసి వేరే షోకి వెళ్లిపోయినా విజయవంతంగానే నడుస్తోంది. అయితే.. ఈ మధ్య ఈ షోకు సంబంధించిన దొరబాబు, పరదేశి అనే కంటెస్టెంట్స్‌కు వ్యభిచార గృహంలో పట్టుబడటంతో యాజమాన్యం ఇక మొత్తం రూల్స్ అన్నీ మార్చేసింది. అందుకే కంటెస్టెంట్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి.. షోలో ఉండాలంటే కండిషన్స్ అప్లై అవుతాయని తెగేసి చెప్పేసిందట.
షోలో నటించే వారు ఇకపై జబర్దస్త్ బయటి ప్రోగ్రామ్స్‌లో చేయకూడదని.. ఒకవేళ చేస్తే మాత్రం కచ్చితంగా కండిషన్ అప్లై అవుతుందని చెప్పారట. అంతేకాదు ఒకవేళ తప్పదని అనిపించినప్పుడు అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పిందట. అయితే.. కండిషన్స్ పాటించనివారు మాత్రం వెళ్లిపోతే తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని.. కొత్త రక్తాన్ని ఆహ్వానిస్తామని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తెగేసి చెప్పిందట.
అంతేకాదు.. ఇకపై డబుల్ మీనింగ్స్ తగ్గించాలని.. ముఖ్యంగా లేడీ గెటప్ వేసేవారు ఇష్టానుసారం చేసేస్తున్నారని.. అవికాస్త తగ్గించి.. అంటే బూతులు తగ్గించి.. కామెడీ పెంచాలని యాజమాన్యం వార్నింగ్ ఇచ్చిందట. ఇవేకాదు ఇంకా చాలానే కండిషన్స్ ఉన్నాయట. మరీ ఇలా కండిషన్స్ పెడితే నటీనటులు ఎలా ఉంటారు..? యాజమాన్యం చెప్పిన కండిషన్స్‌లో ఒకట్రెండు ఓకే గానీ.. మిగిలినవన్నీ చాలా టూ మచ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా పరిస్థితి ఎలా ఉంటుందో..? ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే పూర్తి వివరాలు బయటికి రావాల్సిందే మరి.