Advertisementt

ద‌ర్శ‌కనిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి

Mon 09th Mar 2020 10:02 PM
puri jagannadh,director,kalyani,movie,first look,launch  ద‌ర్శ‌కనిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి
Actress Kalyani Turns Director and Producer ద‌ర్శ‌కనిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి.. ప్రీ లుక్, టీజ‌ర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన పూరి జ‌గ‌న్నాథ్‌

అనేక సూప‌ర్ హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించి, తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న న‌టి క‌ల్యాణి తాజాగా ద‌ర్శ‌క నిర్మాత‌గా మారారు. ఇటీవ‌లి కాలంలో అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తూ వ‌స్తున్న ఆమె కే2కే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా క‌ల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా త‌యార‌వుతోంది.

ఈ సినిమా ప్రీ లుక్‌, టీజ‌ర్ గ్లింప్స్‌ను హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా సోమ‌వారం డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించారు.

చేత‌న్ శీను, సిద్ది, సుహాసినీ మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి, శ్వేత ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానున్న‌ది.

బాల‌న‌టిగా కెరీర్ ఆరంభించిన క‌ల్యాణి, 1986 నుంచి సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. త‌న‌కున్న విస్తృతానుభ‌వంతో ఒక‌వైపు నిర్మాత‌గా మారుతూనే మ‌రోవైపు ద‌ర్శ‌క‌త్వాన్నీ చేప‌ట్టారు.

Actress Kalyani Turns Director and Producer:

Puri Jagan Launches First look of Director Kalyani film

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ