Advertisement

‘పలాస’ను వారు పట్టించుకోపోతే ఎలా..?: తమ్మారెడ్డి

Sun 08th Mar 2020 12:59 PM
palasa 1978 movie,thanks meet,tammareddy,raghu kunche,karuna kumar  ‘పలాస’ను వారు పట్టించుకోపోతే ఎలా..?: తమ్మారెడ్డి
Palasa 1978 Movie Thanks Meet Highlights ‘పలాస’ను వారు పట్టించుకోపోతే ఎలా..?: తమ్మారెడ్డి
Advertisement

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ... ఒక మంచి సినిమా కావాలి అంటారు. మంచి రివ్యూలు కావాలి అంటారు. అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితులు పాత్రలు సినిమాల్లో ఉండవు.. దళిత కథలు సినిమాగా మారవు అంటారు.. కానీ పలాసలో వారి పాత్రలను హీరోలను చేసాము..వారి సమస్యలను చర్చించాము. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు కూడా మీరు చూడకపోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి. ఇది నా ఆవేదన. నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ

సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే. పలాస సినిమా విడుదల తరువాత అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిన సినిమాల్లో పలాస ఒకటి. ఒక మంచి సినిమాలో భాగమయినందుకు సంతోషంగా ఉంది, మళ్లీ ఈ సినిమాను విడుదల రోజు థియేటర్ లో చూశాను, నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. దీనంతటికి కారణం దర్శకుడు కరుణ కుమార్, తను ప్రాణం పెట్టి ఈ సినిమా తీసాడు, తన కష్టం వృధా కాదని భావిస్తున్నాను. నా 40 ఏళ్ల కెరీర్ లో ఇంత బాగా ప్రతి డైలాగ్, సన్నివేశం నాకు గుర్తుండిపోయే సినిమా పలాస అయినందుకు సంతోషంగా ఉందన్నారు.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ... సినిమా చూసిన అందరూ బాగుంది అన్నారు, సినిమా విశ్లేషకులు అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఈ విజయం మాకు మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి ధైర్యం ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ.. సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు. నిర్మాత మంచి ప్రయత్నం, దర్శకుడి ఆలోచన సినిమాను నిలబెట్టాయి. నటీనటులందరూ బాగా చేశారు, నా పాత్ర గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. చిన్న సినిమా అయిన పలాసను పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరూ ఇచ్చిన సహకారంతో ఈ సినిమా ఇంత పెద్ద స్థాయికి వచ్చింది, ఇండస్ట్రీలోని పెద్దలు ఈ సినిమాకు మరింత మాట సాయం చేస్తే బాగుంటుందని తెలిపారు.

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. మీడియా వారందరికీ ధన్యవాదాలు, పలాస సినిమాకు మంచి రేటింగ్స్, రివ్యూస్ వస్తున్నాయి. వైజాగ్ నుండి ఫ్రెండ్స్ కాల్స్ చేసి మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి, మా సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలిపారు.

హీరో రక్షిత్ మాట్లాడుతూ.. సినిమాకు ఇంత మంచి రివ్యూస్ రావడం సంతోషంగా ఉంది, పలాస సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు. సినిమాలో ప్రతి సీన్ గురించి మాట్లాడుకొవడం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.

Palasa 1978 Movie Thanks Meet Highlights:

celebrities speech at Palasa 1978 Movie Thanks Meet

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement