Advertisementt

నిశ్శబ్దం ట్రైలర్: అనుష్క కన్నా ఆమే హైలైట్..

Fri 06th Mar 2020 06:02 PM
anushka,nissabdam trailer,anjali,nani  నిశ్శబ్దం ట్రైలర్: అనుష్క కన్నా ఆమే హైలైట్..
NIssabdam trailer released today నిశ్శబ్దం ట్రైలర్: అనుష్క కన్నా ఆమే హైలైట్..
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమా తర్వాత అనుష్క హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తుంది. బాహుబలి జరుగుతున్నప్పుడు సైజ్ జీరో మొదలుకుని, రెండేళ్ళ క్రితం వచ్చిన భాగమతి, ఇప్పుడు వస్తున్న నిశ్శబ్దం వరకు అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్సే. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమా ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషల్లో రిలీ అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల అయింది.

నేచురల్ స్టార్ నాని నిశ్శబ్దం తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. టీజర్ తో ఏదో మర్డర్ మిస్టరీ చేధిస్తున్నారని తెలిసిన తర్వాత ట్రైలర్ లో మరింత సమాచారం బయటకు వస్తుందని ఆశించారు. కానీ కేవలం ఒకటిన్నర్ నిమిషాల ట్రైలర్ లో పెద్దగా కొత్తగా చెప్పినట్టు ఏమీ కనిపించడం లేదు. కథ మొత్తం అమెరికాలో జరుగుతున్నందున అక్కడి వుడ్ సైడ్ విల్లాలో జరిగిన హత్య గురించి ఇన్వెస్టిగేషన్ గురించే ఉన్నట్టు క్లియర్ కట్ గా చూపించారు.

అయితే ఈ ట్రైలర్ లో ఎక్కువభాగం హీరోయిన్ అంజలినే హైలైట్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరుగా అంజలి అనుష్కని ఇంటరాగేట్ చేస్తూ కనిపించింది. మొత్తం ట్రైలర్ లో ఎక్కువ భాగం అంజలినే కనిపించడంతో ఇందులో అంజలి పాత్ర చాలా ముఖ్యమైనదిగా అర్థం అవుతుంది. కానీ అనుష్కని ఎక్కువ చూపించకపోవడంతో కొన్ని సందేహాలు కలుగుతున్నయి. మరి అనుష్కని హైలైట్ చేయకపోవడంపై వారి కారణాలు ఏంటో వారికే తెలియాలి.

NIssabdam trailer released today:

Anushka Nissabdam trailer released by Nani

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ