Advertisement

‘పలాస 1978’ అని అందరూ మాట్లాడుకుంటారంట!

Fri 06th Mar 2020 05:57 PM
tammareddy bharadwaja,atluri varaprasad,palasa 1978,interview  ‘పలాస 1978’ అని అందరూ మాట్లాడుకుంటారంట!
Palasa 1978 Movie Presenter and Producer Interview ‘పలాస 1978’ అని అందరూ మాట్లాడుకుంటారంట!
Advertisement

‘పలాస 1978’ అందరూ మాట్లాడుకునే చిత్రం అవుతుంది -సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత అట్లూరి వరప్రసాద్

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు... సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత అట్లూరి వర ప్రసాద్.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... డైరెక్టర్ కరుణ కుమార్ పలాస కథ చెప్పినప్పుడు బాగుందని హీరోకు నేను రిఫర్ చేశాను. మా భూమి తరువాత ఆ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది. నిర్మాత ప్రసాద్ ధైర్యంగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన అన్ని కష్టాలను అధికమించి పూర్తి చేసాం.

ఒక మంచి సినిమాకు నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. ‘పలాస 1978’ కు సమర్పకుడిగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గతంలో 40 సినిమాలు చేశాను. అందులో పలాస సినిమా ప్రత్యేకం. డైరెక్టర్ పట్టుదలతో, ఫ్యాషన్ తో సినిమా తీశాము. ఈ సినిమాలో ఎక్కడా నాకు పొరపాట్లు కనిపించలేదు. డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీసాడు. 

అల్లు అరవింద్, మారుతి, బన్నీ వాసు సినిమాను చూసి మెచ్చుకున్నారు. అరవింద్ గారు తన సంస్థలో కరుణ కుమార్ కు అవకాశం ఇస్తానని చెప్పడం గొప్ప విషయం. సురేష్ బాబు గారు మూవీ చూసి నచ్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అంబేద్కర్, గాంధీ గారి ఆశయాలు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు పాటించడం లేదు కానీ వారి బొమ్మలు పెట్టి పూజిస్తున్నారు. డబ్బు ఉన్నవారు, లేనివారు ఎలా ఉన్నారు ? వంటి విషయాలు ఈ సినిమాలో కరుణ కుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. సినిమాలో ఎక్కడా అశ్లీలత ఉండడు.

నిర్మాత వర ప్రసాద్ అట్లూరి మాట్లాడుతూ... సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని బయటికి వచ్చింది. అన్ని విషయాల్లో

తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మమ్మల్ని వెనకుండి నడిపించారు. కొత్త ఆర్టిస్ట్స్ లతో సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒక గ్రామంలో జరిగిన యదార్ధ కథను ఈ సినిమాలో చూపించాము. జీవితంలో ఓడిపోయిన వారి గురించి చెప్పే కథాంశం ఇది. భాద పడిన వ్యక్తులు, నలిగిపోయిన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను పలాసలో బలంగా చూపించడం జరిగింది.

నిర్మాతగా నాకు  పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం పలాస 1978. పది మంది మాట్లాడుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను. నిర్మాత ప్రసాద్ తెలిపారు.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో

నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా  విడుదల చేస్తున్నారు. మార్చ్ 6 న గ్రాండ్  విడుదలకు సిద్దం అవుతున్న  ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్, విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,

నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

Palasa 1978 Movie Presenter and Producer Interview:

Tammareddy and Atluri Varaprasad about Palasa 1978

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement