కరోనాని ఖతం చేసే ప్రకాష్ రాజ్ చిట్కా..

Prakash Raj gave a advice

Wed 04th Mar 2020 09:52 PM
coronna virus,covid 19,prakash raj,harish shankar  కరోనాని ఖతం చేసే ప్రకాష్ రాజ్ చిట్కా..
Prakash Raj gave a advice కరోనాని ఖతం చేసే ప్రకాష్ రాజ్ చిట్కా..
Advertisement

కరోనా హైదరాబాద్ కి కూడా వ్యాపించిందని తెలిసినప్పటి నుండి అందరూ అలర్ట్ అయిపోయారు. అప్పటి వరకు మన దగ్గర రాలేదులే అని తేలిగ్గా తీసుకున్న వాళ్ళు ఒక్కసారిగా అటెన్షన్ లోకి వచ్చేశారు. ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనబడని ఈ వ్యాధి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియాలో ఎన్నో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని, తొందరగా డాక్టర్స్ ని కన్సల్ట్ కావలని సలహాలు ఇస్తున్నారు. భారతదేశం లాంటి ఉష్ణ (వేడి) ప్రదేశాల్లో ఈ వైరస్ బ్రతకదని చెప్తున్నప్పటికీ ఇక్కడి మనుషులకి సోకడం అందరిలో భయాందోళనలు కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలో సెలెబ్రిటీలు తమకు తెలిసిన జాగ్రతలు చెప్తూ అభిమానులకి ఈ వైరస్ గురించి హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగానే నటుడు ప్రకాష్ రాజ్ కరోనా బారిన పడకుండా తనకు తెలిసిన వైద్యాన్ని చెప్తూ ట్వీట్ చేశాడు. వేడి నీళ్ళలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల కరోనాని అరికట్టవచ్చని తనకు నమ్మదగిన సోర్సెస్ నుండి సమాచారం వచ్చిందని..దాన్ని మీ అందరికీ చెప్తున్నాని.. మీరు కూడా మీకు కావాల్సిన వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండని సలహా ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ని టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ రీట్వీట్ చేయడం విశేషం.

Prakash Raj gave a advice:

Prakash raj gave precautions to people about coronna virus


Loading..
Loading..
Loading..
advertisement