లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూవీ ఎడిటర్..

Fri 28th Feb 2020 11:48 PM
sreekar prasad,editor,limca book of records  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూవీ ఎడిటర్..
Editor got a place in Limca book of records లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూవీ ఎడిటర్..
Sponsored links

దర్శకుడు సినిమాని తనకి నచ్చిన పద్దతిలో తీస్తూ పోతుంటే, ప్రేక్షకులకి నచ్చే విధంగా దర్శకుడు తీసిన దాన్ని కత్తిరించి ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో చూసుకుంటూ సినిమాని తెరమీద పరుగులు పెట్టించగల నేర్పరులని ఎడిటర్లు అంటారు. దర్శకుడు తీసిన మొత్తాన్ని చూడాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే దాన్ని ఎడిట్ చేయడానికి ఎడిటర్లు ఉంటారు. సినిమా రెడీ కాగానే ముందుగా చూసేదీ వీరే..

 

ప్రేక్షకుడి సినిమా చూసేది వీరే అయినా వీరి గురించి సామాన్య జనాలకి తెలిసింది చాలా తక్కువ. అయితే తెలిసిన కొందరిలో చెప్పుకోదగిన వాళ్ళలో శ్రీకర్ ప్రసాద్ ఒకరు. మణిరత్నం సినిమాలని దాదాపుగా శ్రీకర్ ప్రసాదే ఎడిట్ చేశాడు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఇప్పటి వరకు సుమారుగా 500 సినిమాలకి ఎడిటర్ గా పనిచేశాడు. ఎనిమిది సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు. 17 భారతీయ భాషల్లోని సినిమాలకి ఎడిటర్ గా పనిచేసినందుకు శ్రీకర్ ప్రసాద్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.

Sponsored links

Editor got a place in Limca book of records:

Editor Sreekar Prasad got a place in Limca Book of records

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019