చిరు మూవీలో మహేశ్.. ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్!

Exclusive Details Over Mahesh In Chiru Movie!

Fri 28th Feb 2020 06:12 PM
mahesh babu,chiranjeevi,koratala,chiru 152  చిరు మూవీలో మహేశ్.. ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్!
Exclusive Details Over Mahesh In Chiru Movie! చిరు మూవీలో మహేశ్.. ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్!
Advertisement

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించబోతున్నారని.. గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.. అయితే ఈ ఇరువురూ ఒకే స్టేజ్‌పైన కనిపిస్తేనే మెగాభిమానులు, ఘట్టమనేని అభిమానులు పూనకాలొచ్చేశాయ్.. అలాంటిది ఇక ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఇక ఇరువురి ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే చిరును ఢీ కొట్టబోతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే పుకారు రాగా వెంటనే స్పందించి అబ్బే అదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా వస్తున్న రూమర్‌పై మాత్రం ఇటు చిత్రబృందంగానీ.. అటు మహేశ్ గానీ స్పందించకపోవడంతో ఇది అక్షరాలా నిజమని.. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా అభిమానులు నమ్మేశారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఫుల్ డీటైల్స్‌ను www.cinejosh.com ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించి పెట్టింది.

 

ఫుల్ డీటైల్స్ ఇవిగో!

ఎస్.. మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ నటించబోతున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం కాస్త బరువు తగ్గాలని కొరటాల సూచించగా తన ఇంట్లో ఉన్న జిమ్‌లో వ్యక్తిగత ట్రైనర్‌తో కసరత్తులు ప్రారంభిచాడు. మహేశ్ పాత్ర కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే.. మహేశ్ ఉన్నది కాసేపే అయినప్పటికీ ఇదే సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

ఫ్లాష్ బ్యాక్‌లో నటించే మహేశ్‌ సీన్స్ సినిమాను మలుపు తిప్పుతుందని సమాచారం. మొదట చిరు సినిమాలో నేనా.. అని ఒకింత ఉలిక్కిపడ్డ మహేశ్.. కొరటాలపై ఉన్న నమ్మకం.. మెగాస్టార్‌పై ఉన్న అభిమానంతో చేయక తప్పలేదట. అంతేకాదు.. సినిమాలో నటించడానికి గట్టిగానే మహేశ్ పారితోషికం.. దాంతో పాటు లాభాల్లో వాటా కూడా అడిగాడని సమాచారం. కాగా.. ఇప్పటి వరకూ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిపోయింది. మహేశ్ మాత్రం 25 నిమిషాల సీన్స్‌కు గాను 30 రోజులు డేట్స్ ఇచ్చారు. మెగాస్టార్-సూపర్ స్టార్ కాంబినేషన్‌లో సినిమా ఏ మాత్రం పండుతుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే మరి.

Exclusive Details Over Mahesh In Chiru Movie!:

Super Star in Mega Star Movie


Loading..
Loading..
Loading..
advertisement