బాలీవుడ్ ప్రయత్నాల్లో ఘాజీ డైరెక్టర్..!

Wed 26th Feb 2020 03:33 PM
ghaaji,vidhut jamaal,bollywood  బాలీవుడ్ ప్రయత్నాల్లో ఘాజీ డైరెక్టర్..!
Sankalp Reddy going to bollywood..! బాలీవుడ్ ప్రయత్నాల్లో ఘాజీ డైరెక్టర్..!
Sponsored links

ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఘాజీ సినిమాతో అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా చేసిన అంతరిక్షం సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. తెలుగులో వచ్చిన మొట్టమొదటి స్పేస్ సినిమాగా ఇది పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులని రంజింప చేయలేకపోయింది. అప్పటి నుండి ఈ దర్శకుడి మరో చిత్రం గురించిన వార్త ఎక్కడా బయటకు రాలేదు.

 

తెలుగు నిర్మాతలు అతడితో సినిమా చేసేందుకు సిద్ధంగా లేరని టాక్. తన మొదటి సినిమా ఘాజీ అప్పుడే తాను విభిన్నమైన చిత్రాలు చేసేందుకే వచ్చానని, అలాంటి సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పిన సంకల్ప్ అలాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ తండ్రిని కలుసుకున్నాడట. ఆయనకి సంకల్ప్ చెప్పిన కథ బాగా నచ్చిందని సమాచారం. అందువల్ల ఆ కథని పూర్తిగా డెవలప్ చేసుకుని రమ్మన్నాడట.

 

అంటే కథ పూర్తిగా సిద్ధం అయ్యి, అది గనక విద్యుత్ తండ్రికి నచ్చితే బాలీవుడ్ లో సంకల్ప్ సినిమా మొదలవుతుందట. ప్రస్తుతం సంకల్ప్ తన కథని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. అయితే విద్యుత్ జమాల్ బాలీవుడ్ లో హీరోగానే కాదు, సౌత్ సినిమాల్లో విలన్ గానూ చేశాడు. మరి విలన్ తో చేస్తున్న సినిమాను సౌత్ జనాలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. 

Sponsored links

Sankalp Reddy going to bollywood..!:

Ghaji director sankalp reddy wants to do a film in bollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019