పవన్‌ ‘పింక్‌’ రీమేక్ ఫస్ట్ సాంగ్ డిటైల్స్!!

Mon 24th Feb 2020 11:50 PM
pawan pink remake,pawan kalyan,first song,thaman,sid sriram  పవన్‌ ‘పింక్‌’ రీమేక్ ఫస్ట్ సాంగ్ డిటైల్స్!!
Pawan PINK Remake First Song Release On..! పవన్‌ ‘పింక్‌’ రీమేక్ ఫస్ట్ సాంగ్ డిటైల్స్!!
Sponsored links

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజిబిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్‌లో ఉండగా ఓ పిక్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అయితే ఆ మధ్య సినిమా రిలీజ్, ఫస్ట్ లుక్ గురించి నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటన చేశారంతే.. ఇంతకు మించి ఇంతవరకూ అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయ్. ఇప్పటికే సినిమా ఎంతవరకూ వచ్చిందనే అప్డేట్‌పై రూమర్ రాగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేడ్ వెలుగు చూసింది. అయితే ఇది పుకారు కాదండోయ్.. ఈ సినిమాకు మ్యూజిక్‌గా డైరెక్టర్‌గా చేస్తున్న థమన్ ట్విట్టర్ వేదికగా ఓ విషయాన్ని పంచుకున్నాడు. ఆ ట్వీట్‌ అర్థమేంటి..? ఆ ట్వీట్‌ను బట్టి థమన్ ఇచ్చిన హింట్ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కల నెరవేరుతోంది!

ఏ వ్యక్తి చిత్రానికైతే స్వరాలు సమకూర్చాలని కలలు కన్నానో.. ఇప్పుడాయన కోసమే పాటలు సిద్ధం చేస్తున్నా. ఎంతో శ్రమతో, శ్రద్ధ, ప్రేమతో పాటలు చేస్తున్నా. త్వరలోనే తొలి పాట వినిపించబోతున్నా’ అని థమన్ ఆ ట్వీట్‌ రాసుకొచ్చాడు. అంతేకాదు.. చివరిగా లవ్ యూ సార్.. గాడ్ బ్లెస్ అని ట్వీట్ చేశాడు. అంటే థమన్ కల త్వరలోనే నెరవేరబోతోందన్న మాట.

మొత్తానికి ఈ ట్వీట్‌ను బట్టి చూస్తే.. త్వరలో ఓ మాంచి ఊపుండే సాంగ్ రిలీజ్ కానుందని దీన్ని బట్టి తెలుస్తోంది. కాగా.. రీమేక్‌‌లోని కీలక గీతాన్ని ప్రముఖ గాయకుడు సిద్‌ శ్రీరామ్‌తో ఆలపిస్తున్న విషయం విదితమే. సిద్ ఆలపించే గీతమే ఫస్ట్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదమో.. రేపు నెల 25 లేదా ఫస్ట్ లుక్‌ కంటే ముందే ఈ సాంగ్‌ను రిలీజ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్.. సో పవన్ ఫ్యాన్స్ బీ రెడీ!

Sponsored links

Pawan PINK Remake First Song Release On..!:

Pawan PINK Remake First Song Release On..!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019